Monday, November 25, 2024
HomeతెలంగాణEturnagaram: ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ సంకీర్త్ ఐపీఎస్

Eturnagaram: ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ సంకీర్త్ ఐపీఎస్

పోలిస్ యంత్రానికి తగు సూచనలు

పోలీస్ స్టేషన్ లకు వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదుదారుని పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి, సమస్య తక్షణ పరిష్కారానికి కృషి చేయాలని ఏటూరు నాగారం ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్ ఐపిఎస్, పోలీసులకు సూచించారు. వెంకటాపురం పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. మొదటగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన వాహనాలను పరిశీలించి, పోలీస్ స్టేషన్ లోని పరిశుభ్రతను, రికార్డులను భద్రపరిచే విధానాన్ని, స్టేషన్ రిసెప్షన్ లో ఫిర్యాదుదారుల పట్ల వ్యవహరించే విధానాన్ని రిసెప్షన్నిస్టు అడిగి తెలుసుకున్నరు. తదుపరి పోలీస్ స్టేషన్ ఆవరణను తిరిగి పరిశుభ్రతలపై తగు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ఏ సమయంలోనైనా ఆకస్మిక తనిఖీలు చేపడతానని తెలియజేశారు.

- Advertisement -

నిర్లక్ష్యంగా ఉన్న పోలీసులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్టికల్స్ విధానంలో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి గుర్తింపు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. సరైన పనితీరును కనబరిచిన అధికారులను ప్రోత్సహిస్తామని తెలియజేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితుల పట్ల మర్యాదగా వివరించాలని, సమస్యను పరిష్కరించే వరకు ఫిర్యాదుదారులకు జవాబుదారీగా ఉండాలని తెలిపారు. దర్యాప్తు చేస్తున్న వివరాలు ఎప్పటికప్పుడు బాధితులకు వివరించాలని, ఎల్లవేళలా ఒకే విధమైన సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధుల్లో సమయపాలన పాటించాలని, న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసులను షరావేగంగా పరిష్కరించే విధంగా దర్యాప్తును పూర్తి చేసే చర్యలు తీసుకోవాలన్నరు. గ్రామాల్లో సందర్శించి ప్రజల్లో ఉన్న సత్సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపురం సిఐ బండారి కుమార్,సిఐ కాగితోజు శివ ప్రసాద్, సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, వెంకటాపురం ఎస్సై తిరుపతి రావు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News