Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Autism: అటిజం పిల్లల తల్లిదండ్రులకు శాపమా

Autism: అటిజం పిల్లల తల్లిదండ్రులకు శాపమా

ఆటిజం పిల్లలతో అద్భుతాలు సృష్టించవచ్చు

బుడి బుడి అడుగులతో ముద్దు ముద్దు మాటలతో బోసి నవ్వులతో ఈ ప్రపంచంలోని ఆనందమంతా రాశులుగా పోసినట్టుండాల్సిన చిన్నారులు అందుకు భిన్నంగా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవ డం, ఏదో తెలియని పరధ్యానం… కొన్నిసార్లు కారణం లేకుండానే బిగ్గరగా ఏడవడం, పదేపదే మారాం చేయడం, తమను తామే గాయపర్చుకోవడం… చేస్తుంటే- తల్లిదం డ్రులు తల్లడిల్లుతారు. పిల్లలకు ఉన్న ఈ రుగ్మతను ఆటిజం అంటారు. ఈ సమస్య ఉన్న పిల్లల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఏడాది వయస్సు వచ్చేసరికే తప్ప టడుగులు వేయాల్సిన చిన్నారులు ఒకరి సాయం లేనిదే ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతున్నారు.
ఆటిజం పిల్లలు అద్భుతాలు
పిల్లలకు చిన్నప్పుడు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఆమడ్యూస్‌ మోజార్ట్‌, సర్‌ ఐజాక్‌ న్యూటన్‌, మైకెలాంజిలో లాంటి వాళ్లను ఆదర్శంగా చూపిస్తుంటూ ఉంటాం. వాళ్లలా మీరు కూడా పెద్దయ్యాక పేరు గడించాలని పిల్లలకు చెప్తుం టాం. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే మనం వారిలోని మేధావితనాన్ని మాత్రమే చూస్తాం. కానీ పైన చెప్పిన వాళ్లందరికీ చిన్నప్పుడు బుద్ధిమాంద్యం. ఐన్‌స్టీన్‌, న్యూటన్‌, మైకెలాంజిలో ఆటిజం బాధితులు. వాళ్లకు ఏదీ ఒక పట్టాన తలకెక్కేది కాదు. నలుగురిలో కలవలేరు. ముభావంగా ఉండేవారు. అవకాశాలను అందిపుచ్చుకుని అద్భుతాలు సృష్టించారు.
కోటి మందికి ఆటిజం
ఆటిజం పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి లెక్కల్లో తేలింది. మన దేశంలో కోటి మందికి పైగా ఆటిజంతో ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి ఆటిజం చాలా సాధారణమైన కమ్యూనికేషన్‌ డిజార్డర్‌. దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. అలా అని నిర్లక్ష్యం చేసేదీ కూడా కాదు. ఆడి పాడే వయసులో పిల్లలు ముభావంగా ఉంటున్నారంటే, వారిలో కచ్చితంగా ఆటిజం లక్షణాలున్నట్టే. ఆటిజం పిల్లల్లో చాలా మందికి ఎటువంటి డయాగ్నసిస్‌ జరగలేదు. వారి లో ఆ లక్షణాలు ఏ మేరకు ఉన్నాయనే అంచనాలు లేవు.
పాప పేరు చేతన. రెండేళ్లు దాటినా మాటలు పల కడమే లేదు. పేరు పెట్టి పిల్చినా కదలిక ఉండడం లేదు. కొన్నిసార్లు గట్టిగా అరుస్తూ చప్పట్లు చరిచి, అంతలోనే నిశ్శబ్దంగా ఉండిపోతుంది. ఇలా వింతవింతగా ప్రవర్తిం చడం చిన్నపిల్లల్లో సాధారణమే అని నిర్లక్ష్యం చేస్తే రెండేళ్లు దాటేసరికి పరిస్థితి ముదిరిపోయింది. ఎందుకంటే ఆ చిన్నారి ఆటిజం ఆనే సమస్యతో బాధపడుతోంది. చేతన లాగే చాలామంది ఆటిజం ఉన్న పిల్లల్లో ఒంటరితనం ఎక్కువ. ఎన్నిసార్లు పిలిచినా పలకరు. అలికిడైనా తలతిప్పి చూడరు. కళ్లల్లో కళ్లు పెట్టి మాట్లాడలేరు. ఏకాగ్రత ఉం డదు. ఒకే వస్తువును పదే పదే గుండ్రంగా తిప్పుతుంటారు. తోటి పిల్లలతో కలవరు. గుంపులోకి అస్సలు వెళ్లరు. రెం డేళ్ల వయసప్పుడే ఆటిజం తాలూకు ఛాయల్ని పసి గట్టవచ్చు.
మనుషుల కంటే వస్తువుల పట్ల ఆసక్తి
ఆటిజం లక్షణాల్లో కొన్ని పసిపిల్లలు అకారణంగా ఏడ్వటం, గంటల తరబడి స్తబ్ధుగా ఉండడం, తల్లిదండ్రులు పిలిచినా ముభావంగా ఉండడం, తెలిసిన వారిని చూసినా నవ్వకపోవడం. బడి వయసు పిల్లలైతే పక్క పిల్లలతో కలవ కపోవడం, ఎప్పుడూ ఒంటరిగా ఉండటం, పిలిస్తే పలక కపోవడం కనిపిస్తుంది. మనుషుల కంటే బొమ్మలు, వస్తు వుల పట్ల ఆసక్తి చూపడం, అడిగిన వెంటనే జవాబు ఇవ్వ లేకపోవడం, సూటిగా చూడలేకపోతుంటారు. స్పష్టమైన భావోద్వేగాలేవీ వ్యక్తం చేయలేరు. మాటలు సరిగా రాకపోవడం, తాము లేదా ఎదుటి వారు గాయపడినా పట్టనట్టు ఉంటారు. నడిచేటప్పుడు మునివేళ్ల మీద నడవ డం, ఎదుటివారు అడగనిదే జవాబుగా చెప్పటం, ఆ సందర్భంగా మాట్లాడడం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు లేదా బొమ్మ పట్ల విపరీతమైన వ్యామోహం పెంచుకుంటారు. దాన్ని తీసేస్తే విపరీతంగా కోపం వస్తుంది. చేతులు, కాళ్లు లేదా వేళ్లు కాస్త అసహజంగా ఒకే తీరులో కదలిస్తుండడం కనిపిస్తుంది. తాము అడిగినవి ఇవ్వకపోతే అరవడం, కొంతమందిలో ప్రతి దానికీ భయ పడడం, గాలికి తీగ లాంటిదే దన్నా కదులుతున్నా చూసి భయపడడం, చీమలాంటిది కనబడినా భయపడడం.. ఇలాంటి పిల్లల్లో ఉంటుంది. చిన్న చిన్న శబ్దాలకూ గట్టిగా చెవులు మూసుకోవడం, శబ్దాలు భరించలేకపోవడం వంటి భావోద్వేగపరమైన అంశాలూ ఉంటాయి.
ఒకింత చికిత్స మరి కాస్త శ్రద్ద
పిల్లలకు చికిత్స కలిగిస్తూనే పిల్లల పట్ల శ్రద్దను కలిగి ఉంటే ఆటిజం పిల్లలతో అద్భుతాలు సృష్టించవచ్చు. పిల్లల్లో భాషాపరమైన ఇబ్బందులు పోగొట్టి స్వేచ్ఛగా మాట్లాడగల స్థాయికి తీసుకెళ్లడం, పిల్లల్లో చురుకుదనం తేవాలి. కావల సిన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఆటిజం పిల్లల్లో దాగిన అద్భుత మేధోశక్తిని వెలికితీయడానికి తల్లిదం డ్రులు, ఉపాధ్యాయులు తమ వంతు సహాకారాన్ని పిల్లల కు అందించాలి. ఆటిజం పిల్లలకు తగిన మందులు వాడ టం, కౌన్సెలింగ్‌, శిక్షణ ద్వారా మానసిక పరిపక్వతను పెంచటం, పిల్లలకు తగు ఆహారాన్ని మాత్రమే ఇవ్వటం ద్వారా ఆటిజాన్ని అదుపు చేయవచ్చు. పిల్లలతో బాటు తల్లి దండ్రుల కూడా ఆటిజం పిల్లల పెంపకం శిక్షణ తీసు కున్నట్లైతే మంచి ఫలితం ఉంటుంది. ఇతర పిల్లలతో గొడ వలు పడటం వంటివి చేస్తుంటే సైకో థెరపీ ద్వారా అదుపు చేయవచ్చు.
డాక్టర్‌ అట్ల శ్రీనివాస్‌ రెడ్డి
సైకాలజిస్ట్‌ ఫ్యామిలీ కౌన్సెలర్‌

  • 9703935321
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News