Sunday, October 6, 2024
Homeహెల్త్Old beauty tips: ఓల్డ్ బ్యూటీ టిప్స్ అదుర్స్, ఎప్పుడైనా ట్రై చేశారా?

Old beauty tips: ఓల్డ్ బ్యూటీ టిప్స్ అదుర్స్, ఎప్పుడైనా ట్రై చేశారా?

సహజసిద్ధమైన. అందాన్ని ఇనుమడింపచేసే సంప్రదాయ మార్గాలు

ఓల్టే గానీ ఇప్పడూ అందంలో ఎవర్ గ్రీన్…

- Advertisement -

ఓల్డ్ ఈజ్ గోల్డ్…ఇది అన్నింటి విషయంలో నిజమవునో కాదా గానీ అందం విషయంలో మటుకు నూటికి నూరు పాళ్లూ నిజమని చెప్పాలి. పాతకాలంలో రసాయనాలకు తావులేని బ్యూటీ చిట్కాలు పాటిస్తూ ఎంతో అందంతో స్త్రీలు మెరిసిపోయేవారని పుస్తకాల్లో, పెద్దలు చెప్పినపుడు మనందరం వింటుంటాం. చర్మం, జుట్టు, కళ్లు..ఇలా అన్ని విషయాలలో పూర్వం ప్రక్రుతి సహజసిద్ధమైన బ్యూటీ కిటుకులనే అనుసరించారు. అవి ఇప్పుడు కూడా అందాన్ని పెంపొందించడంలో ఏమాత్రం తీసిపోవని నేటి ఆధునిక బ్యూటీషియన్లు సైతం ఒప్పుకుంటున్నారు. అలాంటి కొన్ని ప్రాచీన సౌందర్య చిట్కాలు ఉన్నాయి. అవి ఆధునిక మహిళను కూడా అందంగా, ఆరోగ్యంగా అందరిలో ఎలా ప్రత్యేకంగా నిలబెడుతున్నాయో గమనిస్తే ఆశ్చర్యమే వేస్తుంది.

అలాంటి ప్రాచీన బ్యూటీ చిట్కాలలో మొదటిది వేపాకు. ఇది అందాన్ని పెంచే పలు ప్రాచీన పదార్థాలలో రారాజు. వేపచెట్టులోని ప్రతి భాగం మనిషికి ఉపయోగపడుతోంది. వేప నుంచి మనిషి ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నదీ వాస్తవమే. వేప వల్ల యాక్నే తగ్గుతుంది. ఇందుకు కొన్ని వేపాకులు తీసుకుని వాటిని నీళ్లల్లో ఉడికించాలి. ఆ నీళ్లల్లో కాటన్ బాల్ తడిపి దానితో ముఖంపై బాగా రుద్దాలి. వేప, పెరుగు ఫేస్ ప్యాక్ లేదా వేప, కీర ఫేస్ ప్యాక్ ముఖంలోని జిడ్డుతనాన్ని తగ్గిస్తాయి. పొడిచర్మం వారైతే కొద్దిగా వేప పొడి తీసుకుని అందులో కొని గ్రేప్ సీడ్ ఆయిల్ చుక్కలు వేయాలి. ఆ పేస్టును ముఖంపై రాసి పదిహేను నిమిషాలు అలాగే వదిలేయాలి.  ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. దాని ప్రభావం మీ చర్మంపై ఎంతగా ఉందో అందాలీనే మీ ముఖమే చెబుతుంది. జుట్టు సంబంధించిన సమస్యలను సైతం వేప నూనె ఎంతో శక్తివంతంగా పరిష్కరిస్తుంది. చుండ్రును తగ్గిస్తుంది. కొద్దిగా వేప పొడి తీసుకుని అందులో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి గంట సేపు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత షాంపుతో తల రుద్దుకోవాలి. ఇది వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచడమే కాదు నల్లగా నిగ నిగలాడుతూ ఎంతో అందంగా  కనిపించేలా చేస్తుంది కూడా. పూర్వం శరీర అందానికి ఉపయోగించే మరో పదార్థం కుంకుమపువ్వు. ఇది చాలా ఖరీదైన సుగంధ పువ్వు. దీన్ని ముఖానికి రాసుకుంటే చర్మం రంగు రెట్టింపు అవుతుందంటే అతిశయోక్తి కాదు. చర్మంపై ఏర్పడ్డ ట్యాన్ ను ఇది పోగొడుతుంది. కొద్దిగా కుంకుమ పువ్వు తీసుకుని మీగడలో వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం లేచిన తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలిపి పేస్టులా చేసి దాన్ని ట్యాన్ ఉన్న ప్రదేశంపై పూయాలి.  అంతేకాదు కుంకుమపువ్వు చర్మం టోన్ ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిదేమిటంటే సరిపడినంత రోజ్ వావటర్ తీసుకుని అందులో కొద్దిగా కుంకుమపువ్వు వేసి అందులో కరికే వరకూ ఉంచాలి. ఆతర్వాత కాటన్ బాల్ ని ఆ సొల్యూషన్ లో ముంచి దానితో ముఖంపై సున్నితంగా రబ్ చేసుకోవాలి. ఇది చర్మాన్ని వెంటనే మెరిపిస్తుంది. కుంకుమ పువ్వు కాడ తీసుకుని దాన్ని పాలల్లో అరగంట సేపు ఉంచి అందులో ఒక టీ స్పూన్ శాండల్ వుడ్ పొడి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం ముందుగా చెప్పినట్టు ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే పూర్వకాలంలో తేనెను కూడా సౌందర్య సాధనంగా వాడేవారు. దీన్ని మచ్చలపై రాస్తే అవి పోతాయి. ఇందులో యాంటిసెప్టిక్, చర్మానికి సాంత్వన నిచ్చే గుణాలు కూడా ఉన్నాయి. కాలిన గాయాలను మాన్పుతుంది. మచ్చలేని  బంగారంలాంటి చర్మ సౌందర్యాన్ని తేనె వల్ల పొందుతాం.

తేనె, మీగడ, చందనం, శెనగపిండి, రోజ్ ఆయిల్ అన్నింటినీ కలిపి పేస్టులా చేసి దాన్ని ముఖానికి మాస్కులా పెట్టుకోవాలి. ఈ మాస్కును ముఖానికే కాకుండా మెడకు కూడా పూసుకోవాలి. ఈ ప్యాక్ చర్మంపై చేరిన మలినాలను పోగొడుతుంది. అంతేకాదు ముఖంపై చర్మాన్ని ఎంతో మ్రుదువుగా, మెత్తగా చేస్తుంది. ఆమ్లాను కూడా వెంట్రుకలు సౌందర్యానికి ప్రాచీన కాలంలో వాడేవారు. ఇపుడు సైతం పలు శిరోజాల ఉత్పత్తుల్లో ఉసిరి తప్పకుండా ఉంటుంది. రెండు టీ స్పూన్ల ఉసిరి పొడి లేదా జ్యూసును తీసుకోవాలి. అందులో అంతే పాళ్లల్లో లైమ్ రసం పిండాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి మాడుకు అప్లై చేసుకొని ఆరిపోయే వరకూ అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో వెంట్రుకలను శుభ్రం చేసుకోవాలి. ఉసిరి జట్టును మెరిసేలా కూడా చేస్తుంది. ఒక ఇనుప పాత్ర తీసుకుని అందులో ఉసిరి, రీతా, షికాకాయ్ మూడింటినీ వేసి ఉడకనిచ్చి ఒక రాత్రి అంతా దాన్ని అలాగే ఉంచాలి. మర్నాడు దాన్ని ఒడగట్టి షాంపుగా ఉపయోగించాలి. మరొక ప్రాచీన సౌందర్య సాధనం ముల్తానీ మట్టి.

దీన్ని నేచురల్ స్క్రబ్బర్, క్లీన్సర్ గా పేర్కొంటారు కూడా. ముల్తానీ మట్టి ముఖంపై ఏర్పడ్డ మొటిమల తాలూకూ మచ్చలను పోగొడుతుంది. తగినంత ముల్తానీ మట్టి తీసుకుని అందులో తాజా టొమాటో రసాన్ని ,చిటికెడు పసుపు, శాండల్ వుడ్ పొడిని కూడా కలిపి ఆ పేస్టును ముఖానికి రాసుకోవాలి. అది ఆరేవరకూ అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటినీళ్లతో ముఖం కడుక్కోవాలి. ముల్తానీ మట్టిలోకి కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని నల్లటి వలయాలు ఉన్న చోట అప్లై చేసి అరగంట పాటు అలాగే వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. పసుపు కూడా ప్రాచీన అతి ప్రధానమైన సౌందర్య సాధనం అంటే అతిశయోక్తి కాదు. ఇది స్ట్రెచ్ మార్కులను పోగొడుతుంది. కొద్దిగా పసుపు తీసుకుని అందులో శెనగపిండి, పెరుగు వేసి పేస్టులా చేసి స్ట్రెచ్ మార్కులపై పూయాలి. పసుపులోని అద్భుతమైన సుగుణాల వల్ల శరీరంపై ఉన్న స్ట్రెచ్ మార్కలు పోతాయి. అంతేకాదు చర్మంపై ఏర్పడిన ముడతలను కూడా పసుపు పోగొడుతుంది. కొద్దిగా బియ్యప్పిండి, పచ్చిపాలు, టొమాటో రసం తీసకుని వాటికి పసుపు కూడా చేర్చి ఆ పేస్టును ముఖానికి రాసుకని ఆరిపోయేవరకూ ఉంచుకోవాలి. పాదాల పగుళ్లను కూడా పసుపు తగ్గిస్తుంది. కొబ్బరినూనె లేదా ఆముదం నూనె ఎదో ఒకటి తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలిపి ఆ పేస్టును పగుళ్ల చోట రాసి పదిహేను నిమిషాలు అలాగే వదిలేస్తే మంచి ఫలితం చూస్తారు.

మరో ప్రాచీన సౌందర్య సాధనం శాండల్ వుడ్ పౌడర్. ఇది స్కిన్ కేర్ విషయంలో ఎంతో బాగా పనిచేస్తుంది. మ్రుదువైన, పరిశుభ్రమైన చర్మ సౌందర్యాన్ని మీకు అందిస్తుంది.  బాదంపప్పులు మెత్తగా పొడిచేసి అందులో శాండల్ వుడ్, (చందనం)కొద్దిగా పాలను పోసి మెత్తటి పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖం, కాళ్లు, చేతులకు రాసుకుని బాగా ఆరిన తర్వాత స్నానం చేయాలి. అప్పుడు మీ చర్మం ఎంతో హాయిగా ఉండడంతోపాటు, మరింత మ్రుదువుగా తయారవుతుంది. అద్దంలాంటి చర్మ సౌందర్యాన్ని ఇది మీ సొంతం చేస్తుంది. శాండల్ వుడ్ పొడిలో కాస్త పచ్చి పాలు కలిపి దాన్ని ముఖానికి రాసుకొని 20 నిమిషాలు అలాగే ఉంచుకొని తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి.

ప్రాచీన సౌందర్య సాధనంగా తులసిని కూడా ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు కూడా సౌందర్య సాధనాల్లో తులసి వాడకం బాగా కనిపిస్తుంది. తులసి ఆకులను కొన్నింటిని తీసుకని వాటిని మెత్తటి పేస్టులా చేసి అందులో కొద్దిగా పాలు కలిపి దాన్ని ముఖానికి రాసుకుంటే యాక్నే తగ్గడమే కాదు ముఖ వర్ఛస్తు పెంరుగుతుంది. మీ దంతాలను కూడా తులసి మెరిసేలా చేస్తుంది. కొన్ని తులసి ఆకులను తీసుకుని ఎండబెట్టి పొడిచేయాలి. అందులో కమలాపండు తొక్కలు వేసి పేస్టులా చేయాలి. ఆ పేస్టుతో మీ దంతాలను తోముకుని చూడండి అవి ఎంత తెల్లగా మెరిసిపోతాయో తెలుస్తుంది. మీ అందాన్ని పెంచే మరో ప్రాచీన బ్యూటీ సాధనం పెరుగు. రెండు గుడ్లను తీసుకుని వాటిని చిక్కగా కొట్టాలి.

అందులో రెండు టేబుల్ స్పూన్ల బాదం నూనె కలపాలి. ఆ మిశ్రమాన్ని అరకప్పు పెరగులో వేసి బాగా కలిపి ఆ పేస్టును మాడుకు పెట్టుకుని ప్లాస్టిక్ క్యాప్ తలకు పెట్టుకోవాలి. అరగంట సేపు అయిన తర్వాత షాంపుతో తలరుద్దుకోవాలి. ఈ సహజసిద్ధమైన హెయిర్ మాస్కు మీ వెంట్రుకలను నల్లగా నిగ నిగ మెరిసేలా చేస్తుంది. నిమ్మరసం, గుడ్లు, తేనె పేస్టు మీ జుట్టును సిల్కీగా చేస్తుంది. ఈ పేస్టును పెరుగులో వేసి తలకు పట్టించి అరగంట తర్వాత షాంపుతో తలను శుభ్రంగా కడుక్కోవాలి. అందాన్ని పెంచే వంటింటి సాధనం శెనగపిండి ప్రాచీన కాలం నుంచీ బ్యూటీ సమస్యలకు మంచి పరిష్కారంగా వినియోగించడం జరుగుతోంది. సరిపడినంత కీరరసం తీసుకుని శెనగపిండిలో వేసి కలిపి పేస్టులా చేసి ఆ పేస్టును మచ్చలు ఉన్న ప్రదేశంలో పూసి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత నీళ్లతో శుభ్రంచేసుకోవాలి. శెనగపిండి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఇందుకోసం నాలుగు లేదా ఐదు బాదం పప్పులను తీసుకుని పొడి చేయాలి. అలాగే నిమ్మరసం, ఒక టీస్పూను పాలు తీసిపెట్టుకోవాలి. వీటన్నింటినీ కలిపిన మిశ్రమాన్ని మెత్తటి పేస్టులా చేసి దాన్ని ముఖానికి రాసుకుని అరగంట పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ప్రాచీన బ్యూటీ సాధనాలతో మోడ్రన్ అమ్మాయిలూ మీరు మీ అందాన్ని మరింత ఇనుమడింపచేసుకోగలుగుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News