Friday, November 22, 2024
Homeహెల్త్Personal hygiene: ఆడవాళ్లూ.. వ్యక్తిగత శుభ్రత అస్సలు మరవొద్దు

Personal hygiene: ఆడవాళ్లూ.. వ్యక్తిగత శుభ్రత అస్సలు మరవొద్దు

ఇంటి పని, ఆఫీసు పనితో ఖాళీ లేదనకండి, మీ వ్యక్తిగత శుభ్రత కోసం టైం తీయండి

స్త్రీలు వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో కొన్ని అంశాలను మరవకుండా పాటించాలి. అవేమిటంటే..

- Advertisement -

 మీరు వాడే దిండు కవర్లను శుభ్రంచేసేటప్పుడు ఫ్యాబ్రిక్ సాఫ్టనర్ ని వాడొద్దు. తలకు అంటుకుని ఉన్న నూనె, జిడ్డు, మురికి, చెమట వంటివి దిండుకవర్లకు అంటుకుంటాయి. అవి పోవడానికి వాటిని ఉతికేటప్పుడు ఫ్యాబ్రిక్ సాఫ్టనర్ ను చాలామంది వాడుతుంటారు. అలా చేయొద్దు. ఎందుకంటే వాటి తాలూకా మిగులు పదార్థాలు మీ చర్మ రంద్రాలలో చేరే అవకాశం ఉంది. దాంతో మిమ్మల్ని వేధిస్తున్న యాక్నే సమస్య మరింత తీవ్రమయే ప్రమాదం ఉంది. దీనివల్ల చర్మంపై బ్రేకవుట్లు కూడా ఎక్కువవుతాయి. అందుకే ప్రతి రెండు రోజులకు ఒకసారి తప్పనిసరిగా మీ దిండు కవర్లను మార్చడం మరవొద్దు.

 ఆహారం తినేటప్పుడు దంతాల మధ్యన ఇరుక్కుంటుంటాయి. అవి అలాగే పళ్ల సందుల్లో ఉంటే నోరు దుర్వాసన వస్తుంది. అందుకే మీరు ఎక్కడికి వెడుతున్నా మీ బ్యాగులో డెంటల్ ఫ్లాస్ ఉండేలా జాగ్రత్తవహించాలి. ప్లేకర్స్ వంటివి అందుబాటులో ఉంటే అన్నం తిన్న తర్వాత పళ్ల సందుల్లో ఏదైనా ఆహార పదార్థం ఇరుక్కుని ఉంటే దాన్ని వెంటనే తొలగించుకోవచ్చు.

 మీ వెంట టంగ్ స్క్రాపర్ ఎప్పుడూ ఉండాలి. దీని సహాయంతో నాలుక మీద చేరిన తెల్ల గారను శుభ్రం చేసుకోవచ్చు. ఆ తెల్లగార మరేదో కాదు బాక్టీరియా, మలినాలు, మ్రుతకణాలే. టంగ్ స్క్రాపర్ తో నాలుకను నిత్యం శుభ్రం చేసుకోవడం వల్ల నోరు తాజాగా ఉండి ఎలాంటి దుర్వాసన రాదు. మీరు తినే ఆహారం కూడా ఎంతో రుచిగా అనిపిస్తుంది. మీ రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

 బహిష్టు సమయాల్లో తప్ప రాత్రి పడుకునేటప్పుడు అండర్ గార్మెంట్స్ వేసుకోకుండా ఉండడమే ఆరోగ్యం. ఇలా చేయడం వల్ల లోపలి శరీర భాగాలకు గాలి బాగా తగులుతుంది. అంతేకాదు ఈస్ట్, వనీజనల్ ఇన్ఫెక్షన్ల బారిన తొందరగా పడరు.

 బ్లాక్ టీలో పాదాలను నానబెట్టుకుంటే ఎంతో మంచిది. ఇది పాదాలపై చేరిన బాక్టీరియాను నశింపచేస్తుంది. అంతేకాదు చర్మ రంధ్రాలను మూసి తద్వారా పాదాలకు చెమట అంటకుండా సంరక్షిస్తుంది. పాదాలు దుర్వాసన రావు కూడా.

 చంకల్లో చెమట పట్టడం వల్ల దుర్వాసన రావడం సహజం. దీన్ని తగ్గించడంలో హ్యాండ్ శానిటైజర్ బాగా పనిచేస్తుంది. దీన్ని ఎక్కడకెళ్లినా సులభంగా తీసుకెళ్లగలం కూడా. బాక్టీరియా కారణంగా చంకల్లోంచి వచ్చే దుర్వాసనను శానిటైజర్ లోని ఆల్కహాల్ పూర్తిగా పోగొట్టడమే కాకుండా చంకల కింద భాగాన్ని వేగంగా పొడిగా ఉండేలా చేస్తుంది.

 వజీనా సహజసిద్ధంగా తనను తాను శుభ్రంగా ఉంచుకుంటుంది కాబట్టి శుభ్రత కోసం సెంటెడ్ ట్యామ్ ప్యాన్స్, ప్యాడ్స్, డౌచెస్ వంటివాటిని వాడనవసరం లేదు. నిజానికి వీటిని వాడడం వల్లే వజీనల్ ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేషన్ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది.

 చెవి వెనుక గ్రంధులు ఉంటాయి. అవి నూనె, సెబమ్ లను స్రవిస్తాయి. చెవి వెనుక చేరిన మురికి, చెమటలతో ఇవి కలగలిస్తే దుర్వాసన వస్తుంది. అందుకే నిత్యం చెవుల వెనుక భాగం శుభ్రంచేసుకోవాలి.

 శరీరం ప్రైవేటు పార్టుల్లో షేవింగ్ చేసుకునేట్పుడు హెయిర్ కండిషనర్ ఉపయోగించాలి. ఇది ఆ ప్రదేశంలోని వెంట్రకలను మ్రుదువుగా ఉంచడమే కాకుండా షేవింగ్ సమయంలో రేజర్ గాయాలు కాకుండా, ఇరిటేషన్ తలెత్తకుండా సంరక్షిస్తుంది.

 నిద్ర లేచిన వెంటనే గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం పిండుకుని ఖాళీ కడుపుతో తాగాలి. ఈ డ్రింకు శరీరానికి కావలసిన హైడ్రేషన్ అందివ్వడమే కాదు శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News