రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రాష్ట్రం ఆతలాకుతలం అవుతుంది. వరద నీరు ఇళ్లల్లోకి చేరుతుంది. వరద ప్రవాహం తో రోడ్లు దెబ్బతిని రవాణా వ్యవస్థ అస్తవ్యస్తాం అయ్యింది. గురువారం కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పోర్లయి. మల్లాపూర్ మండంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్త ధాంరాజ్ పల్లి గ్రామంలో వరద ప్రవాహం ఇళ్లలోకి చేరింది, రోడ్డుపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని పునరావాస కేంద్రానికి ప్రజలను తరలించారు. రేగుంట -ఇటిక్యాల మధ్యలో ఉన్న బ్రిడ్జి పై వాగు నీరు ప్రవహించింది. వంతెనపై అడుగు మేర నీరు ప్రవహించడం తో రవాణా నిలివేశారు. మల్లాపూర్ మండల కేంద్రం లోని పెద్ద చెరువు, దుర్గమ్మ చెరువులు తెగిపోయాయి. ఓబులాపూర్ వద్ద రోడ్డుపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధిక వర్షాలతో జనం అల్లాడుతున్నారు. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరారు . మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉండటంతో ప్రజలు భయందోళనలో ఉన్నారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలని, గోదావరి తిర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలను కోరారు.