రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా క్రొత్తగా నియమితులైన గౌరవ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గురువారం మధ్యాహ్నం విమానంలో హైదరాబాదు నుండి బయలుదేరి మధ్యాహ్నం 3-50 గంటలకు కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకొన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, రాష్ట్ర హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శేష సాయి, జస్టిస్ దుర్గాప్రసాద్ రిజిస్ట్రార్ జనరల్ వై. లక్ష్మణరావు అదనపు డీజీపీ ఎస్.బి. బాగ్చీ జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా పోలీస్ అధికారి పి.జాషువా రాష్ట్ర ప్రోటోకాల్ అధికారి బాలసుబ్రమణ్యం, విమానాశ్రయం డైరెక్టర్ ఎంఎల్.కే. రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
వారు కాసేపు రిజర్వ్ లౌంజ్ లో విశ్రాంతి తీసుకుని, పోలీసు గౌరవ వందనం స్వీకరించి విజయవాడకు బయలుదేరి వెళ్లారు. వారు ఈనెల 28 వ తేదీన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ స్వాగత కార్యక్రమంలో సహాయ ప్రోటోకాల్ అధికారి టి విజయ్ కుమార్, ఏసీబీ వెంకటరత్నం, అదనపు ఎస్పి ఎస్వీడీ ప్రసాద్, గుడివాడ ఆర్డిఓ పద్మావతి, గన్నవరం డిఎస్పి జయ సూర్య,ఎస్పీఎఫ్ పోలీస్ అధికారులు గుప్తా, గణపతి తదితర అధికారులు పాల్గొన్నారు.