Saturday, November 23, 2024
HomeతెలంగాణYellampalli project : ఎల్లంపల్లి ప్రాజెక్టు 38 గేట్లు ఎత్తివేత

Yellampalli project : ఎల్లంపల్లి ప్రాజెక్టు 38 గేట్లు ఎత్తివేత

6, 69,370 క్యూసెక్కుల నీరు విడుదల

రామగుండం నియోజకవర్గం పరిధిలోని అంతర్గా మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ ప్రాంత శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు నుండి భారీగా వరద నీరు చేరుతుండడంతో గురువారం సాయంత్రం వరకు 38 గేట్లు ఎత్తి వేసి నీటిని వదిలివేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అధికారులు ముందస్తూ జాగ్రత్త చర్యగా 38 గేట్లు ఎత్తి 6లక్షల, 69 వేల, 370 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 146.66 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 148 క్యూసెక్కుల నీరు చేరడంతో దానికి కెపాసిటీ 16.5388 నుండి 20.175 టీఎంసీలకు చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా ఏర్పడింది. దీంతో అధికారులు అప్రమత్తమై శ్రీపాద ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు పార్వతి బ్యారేజీ నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి కడెం ప్రాజెక్టు నుండి ఎక్కువగా నీటి వరద రావడంతో ఇన్ఫ్లో పెరగడం జరుగుతుందని, దీనికి అనుగుణంగా ప్రాజెక్టు నిలువ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నందున గూడెం, ఎన్ టి పి సి, వేమునూరు, నంది ఎరియలకు ఇబ్బంది కాకుండా నీరు విడుదల చేసినప్పటికీ ఇంకా ఎక్కువ మొత్తంలో నీటి నిలువలు ఉన్నందున 38 గేట్లు ఎత్తివేసి 146.71 సామర్థ్యం నిలువలు మాత్రమే ప్రాజెక్టులో ఉండేలా అధికారులు చర్యలు చేపడుతూ అప్రమత్తంగా ఉండి నీటిని వదులుతున్నారు. దీని వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లోకి నీరు చేరుతుండడంతో అధికారులు అప్రమత్తమై ఆయా ముంపు ప్రాంతాల ప్రజలను రక్షిత స్థాయిలకు పంపించడం జరుగుతుంది. ఈ విషయంలో పెద్దపల్లి మంచిర్యాల జిల్లా కలెక్టర్లు అప్రమత్తమై ఎప్పటికప్పుడు తమ సిబ్బందికి సూచనలు ఇస్తూ వారి స్వీయ పర్యవేక్షణ చేస్తూ ముంపు గ్రామాల ప్రజలకుగాని ఇతర ఏ ప్రాణులకు గాని నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా వరద నీరు పెరుగుతునడంతో ఇంకా గేట్లు ఎత్తివేసే అటువంటి ప్రయత్నంలో అధికారం ఉన్నట్లుగా సమాచారం. రెవెన్యూ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఇతర అధికారి యంత్రాంగం అప్రమత్తమై తక్షణ చర్యలు చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News