అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఆళ్లగడ్డ శాసనసభ్యుడు గంగుల బిజేంద్రరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఆర్ నాగులవరం గ్రామ సచివాలయం పరిధిలోగల టి లింగందిన్నె గ్రామంలో ఆయన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దళిత కాలనీలలో ప్రతి గడపకు వెళ్లి నవరత్నాలలో భాగంగా సంక్షేమ పథకాలకు సంబంధించి బుక్ లెట్ లోని సంక్షేమ పథకాలు లబ్ధి పొందారా లేదా అన్న వివరాలపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని యెడల తన దృష్టికి తెస్తే సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అలాగే కాలనీలో రోడ్లు త్రాగునీరు విద్యుత్తు గృహ నిర్మాణాలు తదితర సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సమస్యలను పరిష్కరించేందుకు చీరలు తీసుకుంటానని వారికి భరోసా ఇచ్చారు. కాలనీలలో రోడ్లు విద్యుత్తు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి కాలనీవాసులు తీసుకురావడంతో వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వైసిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నాడని ఆయన ఆదేశాల మేరకు తాము ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని కాలనీవాసులకు వివరించారు. అభివృద్ధి సంక్షేమం కోరుతూ తనను ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించారని అందుకు కృతజ్ఞతగా మీకు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధి చేస్తామన్నారు. రానున్న ఎన్నికలలో ఇంతకుమించి సంక్షేమ అభివృద్ధి జరగాలంటే తనను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని మళ్లీ అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం వచ్చేలా కాలనీవాసులందరూ తనకు సహకరించి ఓట్లు వేయాలని కాలనీవాసులను కోరారు.
ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి, సింగతల మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బద్రి ఎర్రన్న, వెంకటసుబ్బయ్య, జెసిఎస్ మండల ఇన్చార్జి పాణ్యం నాగేష్, నరసాపురం ప్రసాద్ రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు శాగం తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ జయరాముడు, ఎంపీడీవో మధుసూదనరెడ్డి, ఏఈలు వెంకటరాముడు, ప్రమోద్, వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ, విద్యుత్ ఏఈ రాఘవేంద్రరెడ్డి, రెండవ ఎంఈఓ లక్ష్మి, ఏపీవో ప్రతాప్, ఎస్సై శరత్ కుమార్ రెడ్డి, ఏఎస్ఐ శోభన్ బాబు, ఆయా శాఖల అధికారులు సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటీర్లు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.