Sunday, October 6, 2024
Homeనేరాలు-ఘోరాలుCheryala: శ్రీనివాస పెట్రోల్ పంపులో కల్తీ డీజిల్

Cheryala: శ్రీనివాస పెట్రోల్ పంపులో కల్తీ డీజిల్

నిలదీసి రాస్తారోకోకి యత్నించిన వాహనదారులు

చేర్యాల పట్టణంలోని చేర్యాల నుండి ముస్త్యాలకు వెళ్లే దారిలోని శ్రీనివాస పెట్రోల్ పంపులో వీరన్నపేట గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులు దండ బోయిన బాబురావు, ఎల్లసాని నరహరి, పోకల పరశురాములు, గౌండ్ల వెంకటేష్, పోన్నబోయిన నరేష్ వివిధ గ్రామాల డాక్టర్ యజమానులు వరి నాట్లు వేసేందుకు పొలం దున్నడానికి ట్రాక్టర్ లలో డీజిల్ పోయించుకున్నారు. పొలాల్లోకి వెళ్లి పనులు చేస్తుండగా ట్రాక్టర్లు మధ్యలోనే మొరాయిస్తుండడంతో ట్రాక్టర్ యజమానులు కల్తీ డీజిల్ పోశారని గమనించి పెట్రోల్ పంపు యజమాని వద్దకు వచ్చి నిలదీయగా మొదట విషయం ఎవరికీ చెప్పకు 3000 రూపాయలు ఇస్తానని అనడంతో ట్రాక్టర్ యజమాని నా ట్రాక్టర్ రిపేరు చేయడానికి 70000 ఖర్చు అవుతుందనీ అనడంతో పెట్రోల్ పంపుకి తాళం వేసుకొని వెళ్లిపోయారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ట్రాక్టర్లు, ఆటోల యజమానులు ఇక్కడే పెట్రోల్, డీజిల్ పోయించుకున్నమని మా బండ్లు మార్గ మధ్యలోనే ఆగిపోయాయని పెట్రోల్ పంపు వద్దకు ఒకొకరుగా దాదాపు 30 వరకు ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు పెట్రోల్ పంపు వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాయి. వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని వాహనాల యజమానులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.

- Advertisement -

రంగంలోకి దిగిన పోలీసులు
పెట్రోల్ పంపు వద్ద ఆందోళన చేస్తున్న ట్రాక్టర్ యజమానులు డ్రైవర్లు పెట్రోల్ బంక్ యాజమాన్యం వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులు జోక్యం చేసుకొని నినదించి రాస్తారోకో చేయడం వల్ల మీకు ఎలాంటి న్యాయం జరగదని, మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి.. పెట్రోల్ పంప్ యజమాన్యంపై కేసు వేసి చట్టపరమైన చర్యలు తీసుకొని, మీకు న్యాయం కోసం సంబంధిత శాఖ అధికారులకు సంఘటన వివరాలు పంపిస్తామని ఎస్సై తెలిపారు.

రెవెన్యూ శాఖ వివరణ

చేర్యాల మండల కేంద్రంలోని భారత్ పెట్రోలు బంకులో డీజిల్ కల్తీ జరిగిందని విషయం తెలియగానే పెట్రోల్ పంపు వద్దకు వెళ్లి చూడగా అక్కడ పెట్రోల్ బంక్ లాక్ వేసి వుండటంతో శాంపిల్ సేకరించేందుకు వీలుకాలేదు. కల్తీ డీజిల్ ను బాధితుని వాహనం నుండి తీసుకున్నారు పై అధికారులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News