Friday, November 22, 2024
HomeఆటLionel Messi : ఫైన‌ల్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాక్‌..!

Lionel Messi : ఫైన‌ల్‌కు ముందు అర్జెంటీనాకు భారీ షాక్‌..!

Lionel Messi : ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2022 చివ‌రి అంకానికి చేరుకుంది. ఫైన‌ల్‌లో అర్జెంటీనా, ఫ్రాన్స్ జ‌ట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆదివారం జ‌ర‌గ‌నున్న‌ ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు విశ్వ‌విజేత‌గా నిల‌వ‌నుంది. అర్జెంటీనా త‌రుపున‌ ఇదే చివ‌రి ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్ అని మెస్సీ ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి త‌న కెరీర్‌లో అంద‌ని ద్రాక్ష‌గా ఉన్న ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడాల‌ని బావిస్తున్నాడు.

- Advertisement -

ఈ స‌మ‌యంలో ఓ వార్త అర్జెంటీనా అభిమానుల‌ను కంగారు పెడుతోంది. మంచి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ మెస్సీ ఆదివారం జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌కు దూరం అవ్వ‌నున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. క్రొయేషియాతో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో మెస్సీ తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే గురువారం జ‌రిగిన ప్రాక్టీస్ సెష‌న్‌కు అత‌డు దూరంగా ఉన్నాడ‌ని అంత‌ర్జాతీయ మీడియా వ‌ర్గాలు తెలిపాయి. మ‌రీ ఫైన‌ల్ మ్యాచ్ క‌ల్లా మెస్సీ కోలుకుంటాడా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే అర్జెంటీనా మ‌రో స్టార్ ఆట‌గాడు గోమెజ్ కూడా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. దీంతో అత‌డు కూడా ప్రాక్టీస్‌లో పాల్గొన‌లేదు. ఈ ఇద్ద‌రూ ఫైన‌ల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారో లేదో అర్జెంటీనా జ‌ట్టు ఇంకా అధికారిక‌రంగా చెప్ప‌లేదు. ఒక‌వేళ వీరిద్ద‌రూ మ్యాచ్‌కు దూరం అయితే అర్జెంటీనాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News