శేరిలింగంపల్లి నియోజిక వర్గం లోని మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజిబిసి) సంయుక్త భాగస్వామ్యంతో జులై 28 నుండి 30 వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఐజిబిసి గ్రీన్ ప్రాపర్టీ షో ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. శాసన మండలి చీఫ్ విప్ బాను ప్రసాద్, ఎమ్మెల్యే సైది రెడ్డిలతో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి గ్రీన్ బిల్డింగ్, గ్రీన్‌హోమ్, గ్రీన్ ఎయిర్‌పోర్టు లాంటివి తెలంగాణలో ఉండటం గర్వకారణమని అన్నారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారంతో తెలంగాణలో గ్రీన్ కవర్ పెరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సిఐఐ- ఐజిబిసి కి పూర్తి సహకారం అందిస్తామన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజిబిసి) సంయుక్త భాగస్వామ్యంతో జులై 28 నుండి 30 వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఐజిబిసి గ్రీన్ ప్రాపర్టీ షో ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, 70 కి పైగా గుర్తింపు పొందిన ఐజిబిసి సర్టిఫైడ్ హోమ్స్, బిల్డింగ్స్ , ప్రాపర్టిస్ , మరియు పర్యావరణ హిత నిర్మాణం సామాగ్రికి సంబందించిన 50 కి పైగా గ్రీన్ ప్రాడక్ట్స్ ఈ ప్రదర్శన లో పాల్గొనడం జరిగినది. మన హైదరాబాద్ మహా నగరం హరిత భవనాలకు అధిక ప్రాధాన్యత నిస్తూ పర్యావరణ పరంగా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుంది అని, ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ ల కల బంగారు తెలంగాణ నిర్మాణానికి ఇది పునాది అని, దానికనుగుణంగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఎంతో కృషి చేస్తుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు ఈ కార్యక్రమంలో బిల్డర్లు, కొనుగోలుదారులు పాల్గొన్నారు.