Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Godari @ Dhavaleswaram: గోదావరి ఉధృతి ఎల్లుండి నుంచి తగ్గుముఖం

Godari @ Dhavaleswaram: గోదావరి ఉధృతి ఎల్లుండి నుంచి తగ్గుముఖం

శనివారం రాత్రి 9 గం. వరకూ భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక

గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద ఎల్లుండి నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు.

- Advertisement -

శనివారం రాత్రి 9 గంటలకు భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని నీటిమట్టం 55.9అడుగులు ఉందన్నారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14.8లక్షల క్యూసెక్కులు ఉందని రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. సహాయక చర్యల్లో 4NDRF, 6SDRF బృందాలు ఉన్నాయన్నారు.

కృష్ణా వరద ప్రవాహం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1.11 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు జారీచేస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు.

పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరదల పట్ల అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 1800 425 0101 సంప్రదించాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News