Friday, November 22, 2024
HomeతెలంగాణPocharam: రాజు ధర్మాత్ముడు అయితే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది

Pocharam: రాజు ధర్మాత్ముడు అయితే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది

నిజాంసాగర్ సాగునీటి ప్రాజెక్టు సందర్శించిన పోచారం

రాజు ధర్మాత్ముడు అయితే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని స్పీకర్ పోచారం పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ సాగునీటి ప్రాజెక్టును స్పీకర్ పోచారం, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండు కుండలుగా మారుతున్నాయని, ప్రపంచంలోని మొదటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిజాంసాగర్ అని,ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండడానికి కారణం నిజాంసాగర్ ప్రాజెక్టు అని తెలిపారు.

- Advertisement -

ప్రస్తుతం 14.045 అడుగుల లెవల్ లో 15.03 TMC ల నీటిని నిల్వ చేస్తూ మిగిలిన వరదను ప్లడ్ గేట్ల ద్వారా జులై 27 నుండి దిగువన మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారని,ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటితో ఆయకట్టులోని 1.50 లక్షల ఎకరాలకు ఈ వానాకాలంతో పాటుగా వచ్చే యాసంగిలో కూడా డోకా లేకుండా అందించవచ్చని తెలిపారు.

  • ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని,చెరువులు, ప్రాజెక్టులు నిండి సమృద్ధిగా పంటలు పండుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలని , ముఖ్యమంత్రి ని ఆ దేవుడు ఆశీర్వదిస్తున్నాడని అన్నారు.ఈ కార్యక్రమం లొ ప్రాజెక్ట్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News