Friday, November 22, 2024
HomeతెలంగాణVinod: కల్వల ప్రాజెక్టును మినీ లోయర్ డ్యామ్ చేస్తాం

Vinod: కల్వల ప్రాజెక్టును మినీ లోయర్ డ్యామ్ చేస్తాం

రైతులు ఎలాంటి దిగులు చెందవద్దు

కల్వల ప్తాజెక్ట్ గండిని పరిశీలించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్, మాన కొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టును మినీ లోయర్ డ్యామ్ గా తీర్చి దిద్దడానికి తమ వంతు కృషి చేస్తామని, రైతులు మత్స్య కార్మికులు ఎలాంటి దిగులు చెందవద్దని రాష్ట్ర రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్ లు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కల్వల ప్రాజెక్ట్ మత్తడి వద్ద బారీగా గండి పడడంతో నీరు మొత్తం కాళీ కావడం తో ఎడారిగా మారడంతో శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా వినోద్ కుమార్, రసమయి లు మీడియాతో మాట్లాడుతూ… గత 60 ఏళ్ల క్రితం నిర్మాణము చేసిన కల్వల ప్రాజెక్ట్ మత్తడి వద్ద తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు నీటి ప్రవాహం పెరిగి గండి పడటం చాలా బాధాకర మన్నారు. ప్రాజెక్టు గండి ఘటనను ఫోటోలు చిత్రీకరించి, జిల్లా మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, శంకరపట్నం వీణవంక మండలాలకు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి 15 రోజులలో కల్వల ప్రాజెక్టు పనులకు నిధులు మంజూరు చేయుటకు కృషి చేస్తామన్నారు.
లోయర్ మానేరు డ్యామ్ మాదిరిగా కలువల ప్రాజెక్టును మినీ లోయర్ మానేరు తయారు చేయుటకు అన్ని విధాల కృషి చేస్తామని మత్స్య కార్మికులు, రైతులు ఎలాంటి దిగులు చెందవద్దని, హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ శాసనసభ్యులు వోడితెల సతీష్ బాబు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, బీ.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, జడ్పిటిసి శ్రీనివాసరెడ్డి, కల్వల సర్పంచ్ భద్రయ్య, బీ.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, అధికారు లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News