- నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో లాల్ స్వామి పీర్ ను సవారిగా గ్రామంలో పుర వీధుల గుండా ఊరేగించారు. భారీ జనసంద్రంగా మారిన లాల్ స్వామి పీర్ల చావిడి. జిల్లాలోనే చాగలమర్రి గ్రామంలో రెండవ స్థానంలో నిలిచిన మొహర్రం పండుగ. ఈ పండుగకు కుల మత బేధాలు చూపకుండా హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి మెలిసి చేసుకుంటారు. అదే విధంగా లాల్ స్వామి మకానంలో ఉండే లాల్ స్వామి పీరు చిన్నమకానం , పోలీస్ స్టేషన్ వీధి , మంగలి వీధి , పెద్ధమాకనం ఇలా పురవీధుల్లో ఉండే పీర్ల చావిడి వద్దకు ఊరేగిస్తారు అనంతరం ఒకరికొకరు పరస్పరంగా గంధం చల్లుకుంటు మేళా తాళాలతో అంగరంగ వైభవంగా అలా గ్రామం మొత్తం ఊరేగింపుగా బయల్దేరుతారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహకుడు ముల్లా.రఫీ , పోలీస్ సిబ్బంది , హిందూ ముస్లిం సోదరి సోదరీమణులు , భక్తులు , తదితరులు పాల్గొన్నారు.
Muharram: లాల్ స్వామి పీర్ ఘనంగా
సంప్రదాయబద్ధంగా సాగిన ముహర్రం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES