ఆరు తరాల కల్వ వంశంకు చెందిన కుటుంబ సభ్యులు 300 మంది ఒకే చోట కలుసుకున్నారు. ఈ సందర్భంగా కల్వ వంశస్థులు ఒకరిని ఒకరు ఆత్మీయంగా పలకరించుకొని ఆనందంగా గడిపారు. చిన్న కుటుంబాలతో నేడు గడుపుతున్న జీవితాలలో ఇలా ఒకే చోట 300 కుటుంబాలకు వారు కలుసుకోవటం ఎంతో ఆనందంగా ఉందని వీరంతా అంటున్నారు. కలిసి ఉంటే కలదు సుఖమని పాత సామెత ఈరోజు గుర్తొస్తుందని కల్వ వంశస్థులు తెలిపారు. చిన్న పిల్లల నుండి 90 ఏళ్ల వయసు ఉన్న వారందరూ ఒకే దగ్గర కలిసినందుకు వారి ఆనందానికి హద్దు లేదు. నేటితరం పిల్లలకు కుటుంబ విలువలు తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుందని తెలిపారు. కల్వ కుటుంబం సభ్యులు కొంత మంది దేశ, విదేశాల్లో స్థిరపడి, మరికొంత మంది తాండూర్, వరంగల్, సూర్యాపేట, హైదరాబాద్ లో స్థిరపడ్డారు. రజాకార్ల కాలంలో ఈ వంశీకులు కొందరు తాండూర్ నుంచి బెంగుళూరుకు వ్యాపార నిమిత్తం వెళ్ళారు. రాజయ్య, రామయ్య, లక్ష్మయ్య, సూర్య నారాయణ , మానిక్యప్ప వంశానికి చెందిన 300 మంది సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.