Friday, September 20, 2024
HomeతెలంగాణChevella: ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు

Chevella: ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు

పాల్గొన్న జేఏసీ చైర్మన్ కోదండరాం కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్

చేవెళ్ల మండల కేంద్రంలోని కెజిఆర్ గార్డెన్ లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు ఉద్యమ నాయకులు దేశమొళ్ల ఆంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఏసీ చైర్మన్ కోదండరాం కాంగ్రెస్ పార్టీనాయకులు అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. సభను ఉద్దేశించి దేశంలో ఆంజనేయులు మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమాల వైపు నడిపించిన వ్యక్తి కోదండరామన్నారు. రాష్టం కోసం అటుకులు మక్కబుట్టలు జామకాయలు తిని మంచి నీళ్లు త్రాగి ఉద్యమించామన్నారు. ఉద్యమకారులు ఏ పార్టీలో ఉన్న వారికి ప్రత్యేక గుర్తింపునిచ్చి పదవులు ఇయ్యాలన్నారు. తమతో కలిసి పనిచేసిన ఉద్యమకారుల ప్రశంస పత్రాలు ఇస్తున్నామన్నారు. జార్ఖండ్ రాష్ట్రం 2001లో ఏర్పడిన అనంతరం ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపుని ఇవ్వలేరని ఉద్యమకారులు ఆత్మగౌరవం కోసం 10 సంవత్సరాల పోరాటం అనంతరం వారికి గుర్తింపుని ఇచ్చారన్నారు. ఉద్యమకారులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంత ఉద్యమకారుడు యాదిరెడ్డి మరణం దేశ రాజకీయాల్ని ఆలోచింపచేసిందన్నారు. తెలంగాణలో ఉద్యమకారులను గుర్తించండి అని అడుక్కునే పరిస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. చారు మజిందర్ లాంటి ఉద్యమకారులు కమ్యూనిస్టు ఉద్యమాలను పరిచయం చేసిందన్నారు. ప్రాణత్యాగం చేసిన ఉద్యమకారులు రాష్ట్రంలో అంటరానివారయ్యారన్నారు. రాష్ట్రంలో పదవులు అనుభవిస్తున్న ప్రతి నాయకుడు ఉద్యమ తల్లికి పుట్టిన కొడుకు అన్నాడు. ఉద్యమకారులను ఆత్మగౌరవాణి కించపరుస్తున్న ఈ ప్రభుత్వంపై అన్ని సంఘాల్లో ఐక్యమై ఉద్యమిస్తారన్నారు. 12వందల మంది ఆత్మబల్లి నానంతో ఏర్పడ్డ రాష్ట్రం దొంగల పాల అయిందన్నారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతామన్నారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ, సుష్మ స్వరాజ్, మీరా కుమారి ముగ్గురు తల్లులతో ఏర్పడిందనన్నారు. ఉద్యమం ఉద్యమకారుని గౌరవించిందని ప్రభుత్వం ఉద్యమకారుల అస్తిత్వం ఆత్మగౌరవం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమాన్ని బ్రతికించుకున్నం తెలంగాణను రక్షించుకున్నం అన్నారు.

జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ… ఉద్యమకారులు ఇంట్లో బ్రతకలేరని వారి త్యాగ ఫలితాలలో వల్ల కెసిఆర్ సీఎం అయ్యారన్నారు.తెలంగాణ ఉద్యమాన్ని వక్రీకరించారన్నారు.తెలంగాణ ఏర్పడ్డాక రంగారెడ్డి జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదన్నారు. రైతులు పందిరి వ్యవసాయం పడకేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు డా.చీర శ్రీనివాస్ పెద్దమకారుల పోరం పార్లమెంట్ ఇన్చార్జ్ యాలాల మహేశ్వర్ రెడ్డి ఉద్యమకారులు ఐలయ్య యాదవ్ మోత్కుపల్లి అశోక్ ఉపేందర్ రెడ్డి షేర్ పెంటారెడ్డి పత్తి సత్యనారాయణ శ్రీనివాస్ యాదవ్ మదెల శీను మల్లేష్ పాండు యాదవ్ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News