చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో నాలుగు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే చెన్నూర్ ఆర్టీసీ బస్ డిపో పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్. ఆదివారం రోజున నియోజకవర్గ కేంద్రంలో నాలుగు కోట్లతో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు భూమి పూజ చేసి తానే స్వయంగా జేసిబితో మట్టి తోడి పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా విప్ మాట్లాడుతూ…చెన్నూరు నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలకు ఈరోజు ఒక శుభదినం అన్నారు. డిపో ఏర్పాటు పట్ల నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దల కళ చెన్నూరు బస్ డిపో నేడు సాకారం అవుతున్నదని అన్నారు. గత ప్రభుత్వాల హాయంలో ఎన్నో ఆందోళనలు చేసిన ఎవరూ పట్టించుకోలేదు. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడిగిన వెంటనే నియోజకవర్గ ప్రజల కొరకు బస్ డిపో మంజూరు చేపించామన్నారు. వారికి ఈ సందర్బంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. నేషనల్ హైవేకి అనుకొని నాలుగు ఎకరాల్లో నాలుగు కోట్ల రూపాయలతో బస్ డిపో నిర్మాణం రెండు నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నాం అని తెలిపారు.
రెండు నెలల్లో బస్ డిపో నిర్మాణం పూర్తి చేసుకొని చెన్నూరు కేంద్రంగా మంచిర్యాల, జైపూర్, భీమారం, కోటపల్లి మండలాలతో పాటు నెన్నెల, భీమిని, కన్నెపల్లి, మంథని, కాటారం, మహదేవపూర్, గోదావరిఖని, పెద్దపెల్లి, అదిలాబాద్, బాసర వరకు రవాణా సౌకర్యం ఉండేలా బస్సులు ఏర్పాటు చేస్తాము. ఈ సందర్భంగా బస్ డిపో ఏర్పాటుకు సహకరించిన మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ గోవర్ధన్, ఎండి సజ్జనార్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే చెన్నూరు పట్టణంలో 168 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. వర్షాకాలం ముగిసిన వెంటనే 1658 కోట్లతో సుమారు లక్ష ఎకరాలకు నీరు అందించే చెన్నూర్ ఎత్తిపోతల పథకం పనులు, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తాం. గతంలో గెలిచిన పార్టీలు, నాయకులు ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చెన్నూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో పనిచేసే ప్రభుత్వాన్ని, పనిచేసే నాయకులని తిరిగి గెలిపించుకోవాలని అన్నారు. ఇతర పార్టీల, విపక్షాల దుష్ప్రచారాలు, మోసపూరిత వాగ్దానాలు నమ్మకూడదని ప్రజలకు ఈ సందర్బంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆరెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.