కర్నూలు జిల్లా గార్గేయపురంలో జూలై 29, 30 న రెండు రోజుల పాటు జరిగిన రోప్ స్కిప్పింగ్ రాష్ట్ర స్థాయి పోటీలలో పాత 12 జిల్లాలకు చెందిన 700 మంది విద్యార్థులు పాల్గొన్న అండర్-17 విభాగంలో శ్రీ సుధ హై స్కూల్ విద్యార్థులు సత్తాను చాటి పథకాలు సాధించారనీ శ్రీ సుధా హై స్కూల్ కరెస్పాండెంట్ వేణుగోపాల్ మీడియా ద్వారా తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పోటీలలో మా పాఠశాలకు చెందిన 1. కృష్ణ సుమంత్ కు ఫ్రీ స్టైల్ లో బ్రోంజ్ మెడల్, 2. డబల్ టచ్ స్పీడ్ విభాగంలో టి.శరత్ , జి.మహేష్, యం. కృష్ణ సుమంత్ లకు బ్రోంజ్ మెడల్, 3.డబల్ అండర్ స్పీడ్ స్పిరిన్టు రియాలి విభాగంలో బ్రౌన్ మెడల్ టి శరత్, యం.కృష్ణ సుమంత్, జి.మహేష్, టి హర్ష వర్ధన్ రెడ్డి లకు బ్రోంజ్ మెడల్. రాష్ట్ర పతకాలు సాధించారని.. అలాగే జాతీయ స్థాయిలో జరిగే రోప్ స్కిప్పింగ్ పోటీలకు టి.శరత్, జి.మహేష్, యం.కృష్ణ సుమంత్, టి.హర్ష వర్ధన్ రెడ్డి, యం.మనిసాగర్, రవి కుమార్ లు ఎంపికైనట్లు వీరు సెప్టెంబర్ నెలలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సుధ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్స్ సుదర్శన్, రాజా సుధాకర్ గుప్త, సూర్య నారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు, హరి, మనోహర్, జాన్, ప్రిన్సిపల్ సుజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ ఏ.ఈ.చంద్ర శేఖర్ గౌడ్, ఉపాద్యాయులు ఎలిజిబెత్, ఆంజనేయులు పాల్గొన్నారు.