కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు జేజేలు పలుకుతున్నారని నగర మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. 19వ వార్డు 47వ సచివాలయ పరిధిలోని నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీలో మేయర్, ఎమ్మెల్యే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు.
ఇంటింటికి సంక్షేమ వివరాల బుక్ లెట్ అందజేశారు. ప్రజల సమస్యలు శ్రద్ధతో ఆలకించారు. ఈ తరుణంలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా తమకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, మేయర్, ఎమ్మెల్యే వద్ద పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, యువత, మహిళ, రైతు వంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పెద్దపీట వేసిన ఏకైక సిఎం జగనే అన్నారు. జగన్ వల్లే సంక్షేమం అభివృద్ధి, వెల్లువిరుస్తుందన్నారు. ప్రజలందరికీ మంచి చేశాం కాబట్టే ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లగలుగుతున్నామని వెల్లడించారు.
ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ జగనన్న పాలన అంటే పేదల మోములో చిరునవ్వులు చిందించడమే అన్నారు. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల ద్వారా పెత్తందారీతనంతో వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. ప్రస్తుతం వలంటీర్ వ్యవస్థతో ఎక్కడికీ వెళ్లే పని లేకుండా అన్ని పనులు సచివాలయం ద్వారా స్థానికంగానే జరుగుతున్నాయన్నారు. ఎంతగానో మంచి చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి ప్రజలంతా కృతజ్ఞత భావంతో ఉండాలని కోరారు.
కార్యక్రమంలో రాష్ట్ర వీరిశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోలు గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి, వైయస్ఆర్ సిపి మహిళా విభాగం జోనల్ ఇంచార్జ్, కార్పొరేటర్ గాజుల శ్వేత రెడ్డి, కార్పొరేటర్లు వైజ అరుణ, లక్ష్మికాంత రెడ్డి, నారయణ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, విక్రమసింహా రెడ్డి, డిఈఈ రవిప్రకాష్ నాయుడు, ఏఈ జనార్ధన్, నాయకులు కనికే శివరాం, విష్ణువర్ధన్ రెడ్డి, సామన్న, బాబుల్ రెడ్డి, అనిల్ కుమార్, బాబు రెడ్డి, శ్రీధర్ రెడ్డి, బాలచంద్ర రెడ్డి, పందిపాడు శివశంకర్ రెడ్డి, తిరుపాలు, లక్ష్మీపతి, చిన్న, శ్రీను, వేదవతి, శ్రీనివాస రెడ్డి, సంతోష్, వెంకట్ రెడ్డి, సంజీవరెడ్డి, శానిటేషన్ ఇంస్పెక్టర్ ఆర్.రాజు, ట్యాప్ ఇంస్పెక్టర్ రఫిక్, మేస్త్రి నర్సింహులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.