Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Jagan : సీఎం సమీక్ష సమావేశం.. 32 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్

YS Jagan : సీఎం సమీక్ష సమావేశం.. 32 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం పార్టీ నేతలతో సమీక్ష సమావేశంలో నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇంఛార్జ్‌ మంత్రులు, ముఖ్య నేతలతో పాటు, 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ కోసం సరిగ్గా పనిచేయని 32 మంది ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పనితీరు మెరుగు పరుచుకోవాలని.. లేకపోతే వచ్చే ఎన్నికల్లో వేటు తప్పదంటూ 32 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ 100 రోజులు పార్టీకి చాలా ముఖ్యమైనవని, పనితీరు మార్చుకోని వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోనని, కొత్త అభ్యర్థులను బరిలోకి దింపుతానని అన్నారు.

- Advertisement -

ఎవరినీ మార్చాలనే ఉద్దేశం తనకు లేదని..అందరిపైనా తనకు ఎనలేని ప్రేమ ఉందన్నారు. కానీ.. వాళ్లని మార్చే పరిస్థితి మీరే తెచ్చుకుంటున్నారని సీఎం జగన్ తెలిపారు. జగన్ వార్నింగ్ ఇచ్చినవారిలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 10 రోజుల కంటే తక్కువగా పాల్గొన్నవారిలో 32 మంది వరకూ ఉన్నారని ఐప్యాక్ సంస్థకు చెందిన రిషి తమ నివేదికలో వివరించారు.

మనకు ఎన్నికలకు ఇంకా 16 నెలల టైమ్‌ మాత్రమే ఉంది. కాబట్టి, ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, ఆ ఇంటికి చేసిన మంచిని వివరించి, వారి ఆశీర్వాదం కోరండి. అప్పుడే వారి నుంచి మనకు సానుభూతి లభిస్తుంది. ఎందుకంటే, ఎన్నికల ముందు మీకు అంత సమయం ఉండదు అని సీఎం జగన్ హితవు పలికారు. అలాగే గ్రామాల్లో అత్యధిక ప్రభావం చూపే (హై ఇంప్యాక్ట్‌ వర్క్‌) పనులను గుర్తించి.. ఎక్కడా స్వప్రయోజనాలు ఆశించకుండా.. ఎవరినో సంతోషపర్చాలని కూడా ఆలోచించకుండా ముందుకి సాగాలని సూచించారు. ఆ పనుల కోసం ప్రతి సచివాలయానికి కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదని.. అందరూ ముందుకు సాగాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News