Friday, September 20, 2024
HomeతెలంగాణKCR: ఛత్రపతి సాహూ మహరాజ్ గొప్ప సామాజిక సంఘ సంస్కర్త

KCR: ఛత్రపతి సాహూ మహరాజ్ గొప్ప సామాజిక సంఘ సంస్కర్త

అంబేద్కర్, చత్రపతి శివాజీ, సాహు మహారాజ్, మహాత్మ జ్యోతిరావు పూలేలకు పుష్పాంజలి

అన్నా భావ్ సాటే సహా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, చత్రపతి శివాజీ, సాహు మహారాజ్, మహాత్మ జ్యోతిరావు పూలే తదితర మహనీయుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళి అర్పించారు సీఎం కేసీఆర్. ఛత్రపతి సాహూ మహరాజ్ గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అంటూ కేసీఆర్ గుర్తుచేశారు.

- Advertisement -

ఛత్రపతి సాహూ మహరాజ్ గొప్ప సంఘ సంస్కర్త. మరాఠాల రాజ వంశానికి చెందిన వారైనప్పటికీ సర్వదా నిమ్న కుల వర్గాల, కులేతర సమూహాలకు రిజర్వేషన్ వ్యవస్థ కల్పించిన గొప్ప మానవతవాది. 1874 జూన్ 26న మహరాష్ట్రలో జన్మించిన సాహూ మహరాజ్ 1992 మే 6న పరమ పదించారు. భారత రాచరిక రాష్ట్రమైన కొల్హాపూర్ మొదటి మహరాజు ఈయన. 1990 నుంచి 1922 మధ్య కాలంలో పరిపాలన సాగించిన సాహూ మహరాజు తన పాలన కాలంలో రిజర్వేషన్ కల్పించారు. గొప్ప ప్రజాస్వామ్య వాదిగా పేరు గడించారు.

కళాకారులు దత్తోబా పవార్, డిట్లోబా దాల్వా ద్వారా సాహూ మహరాజును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు పరిచయం చేశారు. భీంరావు గొప్ప తెలివితేటలు, అంటరానితనం గురించి అతని విప్లవాత్మక ఆలోచనలు మహరాజును ఎంతగానో ఆకట్టుకున్నాయి. కుల అధారిత రిజర్వేషన్ అందించడం ద్వారా కుల విభజన ప్రతి కూలతలను తొలిగించడానికి సాధ్యమైన మార్గాలను పరిశీలించి అంటరానివారి అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి సాహూ మహరాజ్. సమాజంలో వేర్పాటు వర్గాల అభ్యున్నతికి కృషి చేసే నాయకుడు అంబేద్కర్ అని భావించి అంబేద్కర్ ను చైర్మన్ గా చేసిన ఘనత సాహూ మహరాజ్ ది. విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదవడానికి అంబేద్కర్ కు సాహూ మహారాజ్ అప్పుడే రూ. 2500 అందించారు.

భారత దేశ చరిత్రలో దళిత, బహుజనులను విముక్తి చేయడానికి సైద్ధాంతికంగా, పాలనపరంగా మహాత్మ జ్యోతిబాపులే, ఛత్రపతి శివాజీల వారసుడిగా కృషి చేసిన మహానీయుడు ఛత్రపతి సాహూ మహారాజ్. 11 ఏండ్లకే తల్లిదండ్రులను కోల్పోయిన సాహూ ..పెరుగుతున్న కొద్దీ ఆదునిక భావాలు పుణికి పుచ్చుకున్నాడు. తన పాలనలో నిమ్నకులాలకు పెద్దపీట వేసి వారి అభివృద్ధికి పెద్దపీట వేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News