చేనేత కార్మికులకు చేయూత ఇవ్వాలని అందుకు అనుగుణంగా వచ్చే ఎన్నికల్లో టిడిపి మేనిఫెస్టోలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు, రోహిణి ఇన్ఫ్రా అవెన్యూ ప్రవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, కొంకతి లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.మంగళవారం కర్నూలు జిల్లా ఓర్వకల్ ఏయిర్ పోర్ట్ వద్ద టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కొంకతి లక్ష్మీనారాయణ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. అలాగే చేనేతల అభివృద్ధి కు ప్రత్యేక కార్యాచరణ తయారు చేయాలని చేనేత కార్మికులు తరుపున వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగుప్రభ ప్రతినిధితో మాట్లాడారు. చేనేత కళకు జీవం పోసి పూర్వ వైభవం తీసుకురావాలి. సాంకేతిక విద్యలో చేనేత నైపుణ్యాలను చేర్చి ఉపాధి అవకాశాలు పెంచాలి. చేనేత టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు చేసి జీవన్మరణ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతన్నల వలసల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వచ్చే ఎన్నికల్లో చేనేత సామాజిక వర్గానికి ఎమ్మెల్యే, ఎంపీ, సీట్లు కేటాయించి న్యాయం చేయాలని కోరారు. ఇందుకు చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని లక్ష్మీనారాయణ తెలిపారు.
Kurnool: చేనేతకు చేయూత ఇవ్వండి
చేనేత సామాజిక వర్గానికి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించండి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES