ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బిఆరెస్ పార్టీ అధ్యక్షులు డా బాల్క సుమన్ హైదరాబాద్ లోని సింగరేణి సంస్థ ప్రధాన కార్యాలయం సింగరేణి భవన్ లో సంస్థ సి అండ్ ఎండి ఎన్.శ్రీధర్ ను కలిశారు. చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి పట్టణం, రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి వార్డులలో సీసీ, బీటీ రోడ్లు, త్రాగు నీరు, డ్రైనేజ్ నిర్మాణాలు, సానిటేషన్ మరియు సింగరేణి స్థానిక ప్రాంతం ఏరియాలోని పలు సమస్యల పరిష్కారంనకు సంబంధించి శ్రీధర్ వివరించారు. ఇప్పటికే నిధులు మంజూరు చేయబడి కొనసాగుతున్న పనులు మరింత వేగవంతం చేయవలసిందిగా కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రామకృష్ణాపూర్ పట్టణంలో జీవో నెం 76 ద్వారా అందిస్తున్న ఇండ్ల పట్టాలకు సంబంధించి గతంలో చేసిన సర్వేలో పలు కారణాల వల్ల ఆగిపోయిన, భగత్ సింగ్ నగర్, రాజీవ్ నగర్, శివాజీ నగర్, జవహర్ నగర్, శ్రీనివాస్ నగర్, మల్లికార్జున నగర్, గంగా కాలనీ, విద్యానగర్, ఆర్కే-4 గడ్డ, పోస్ట్ ఆఫీస్ లైన్ లకు చెందిన భూముల క్రమబద్ధీకరణ చేయుటకు రెవెన్యూ డిపార్ట్మెంటుకు అందించవలసిందిగా కోరడం జరిగింది. దీనివల్ల అదనంగా మరో 1200 గృహాలకు ఇండ్ల పట్టాలు అందించనున్నారు. ఇప్పటికే పట్టణంలో ఆరు విడతల్లో భాగంగా 3035 గృహాలకు ఇండ్ల పట్టాలు అందించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ రెండవ వార్డ్ లోని జ్యోతినగర్ లో నిర్మించనున్న కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ కోసం సింగరేణి నుండి 30 ఎకరాల భూమి అప్పగించాలని కోరారు. ఎమ్మెల్య కోరిన అంశాలపై సింగరేణి సీ అండ్ ఎండి శ్రీధర్ సాలకూలంగా స్పందించారని తెలిపారు.