Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Somarapu Sathyanarayana: రామగుండం ఎమ్మెల్యేగా పోటీ చేస్తా

Somarapu Sathyanarayana: రామగుండం ఎమ్మెల్యేగా పోటీ చేస్తా

బీజేపీలోనే ఉంటానన్న సోమారపు

ప్రజల కోరిక మేరకు రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు, అది బిజెపితోనే పోటీలో ఉంటానని రామగుండం మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమవారపు సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు గోదావరిఖని శివాజీనగర్ లోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గంలో ప్రజల కోసం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ద్యేయంగా, నియోజక వర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, అది బిజెపి పార్టీతోనే తానూ పోటీలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, బిజెపి పార్టీతోనే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News