మేకప్ వేసుకోవడం అంటే ఇష్టం లేని వాళ్లు ఉంటారు. ఇలాంటి వాళ్లకు ఉపయోగపడే కొన్ని మేకప్ ట్రిక్స్ ఉన్నాయి. వాటితో అందంగా కనిపించవచ్చు. అలాంటి మేకప్ ట్రిక్స్ లో ఒకటి ఫౌండేషన్ జోలికి వెళ్లకుండా ఉండడం. విపరీతమైన ఫౌండేషన్ వల్ల చర్మ రంధ్రాలు మూసుకపోతాయి. దానికి బదులు టింటెడ్ ఆల్ట్రా లైట్ సన్ స్క్రీన్ ఫ్లూయిడ్ అప్లై చేసుకోవచ్చు. ఇది చర్మంలోకి సులభంగా ఇంకుతుంది.
చర్మం తాజాగా ఉండడంతో పాటు మెరుస్తుంది. అంతేకాదు ముఖంపై మేకప్ బరువు ఫీలవరు కూడా. ఇందులోని యాంటాక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మిగతా మేకప్ ఉత్పత్తుల అవసరం లేకుండా చేస్తాయి. పెదవులు మ్రుదువుగా, మెరుస్తూ ఉండలంటే కలర్ ఛేంజింగ్ టింట్ తో పెదాల సహజ అందాన్ని ఇనుమడింపచేసుకోవచ్చు. ఉదాహరణకు లిప్ స్టిక్ క్వీన్ లిప్ స్టిక్ ఇన్ ఫ్రాగ్ ప్రిన్స్ మీ పెదవులను గులాబీ రంగుల్లో మెరిసేలా చేస్తుంది. సహజ అందంతో పెదాల అందాన్ని రెట్టింపుచేస్తుంది. ఇందులోని యాంటాక్సిడెంట్ల వల్ల పెదాలపై ఉండే చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పెదవుల సహజమెరుపును మరింత ఇనుమడింపచేస్తుంది.
షియా బటర్, విటమిన్ ఇ కాంబినేషన్ తో తయారైన ఈ లిప్ స్టిక్ పెదాలను మ్రదువుగా చేస్తుంది. పెదాలకు గ్లోసీ లుక్ ఇస్తుంది. దీంతో పెదాలకు తగినంత మాయిశ్చరైజర్ అంది అవి పొడారినట్టు కావు. మరో మేకప్ ట్రిక్ ఏమిటంటే ఖనిజాల మిశ్రమం అయిన బ్రౌంజింగ్ పొడిని చర్మానికి అప్లై చేయడం వల్ల దానికి మంచి మెరుపు వస్తుంది.
అందంగా కనిపించడానికి రకరకాల ఉత్పత్తులు వాడడం ఇష్టం లేని వాళ్లు సిటా ఆల్ ఓవర్ షిమ్మర్ డ్యూ పౌడర్ ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇది బుగ్గల అందాన్ని బాగా హైలైట్ చేస్తుంది. కనుబొమల విషయానికి వస్తే ట్వీజర్మ న్ బ్రోమౌస్సె జెల్ ఉంది. ఇది కనుబొమలకు అతుక్కోకుండా వాటిని షైనీగా ఉంచుతుంది. సహజంగా ఆలస్యంగా నిద్రలేచిన ముఖాలు అలసినట్టు, వాడినట్టు ఉంటాయి. అలా కనిపించకుండా చేసే లోరాక్ డబుల్ ఫీచర్ కన్సీలర్ మేకప్ లేని మీ ముఖానికి మెరపును చేకూరుస్తుంది. బ్లిక్ లాష్ ప్రీమియర్ నల్లగా ఉండి చూడడానికి మస్కారాలా ఉంటుంది. ఇది మీ కనురెప్పలను మంచి కోటింగ్ ఇవ్వడమే కాకుండా అందంగా కనిపించేలా చేస్తుంది.
కనురెప్పలకు కావలసిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. దీన్ని కనురెప్పలకు అప్లై చేసుకుంటే చాలు. ఇది సరిపడదనుకుంటే దీని మీద మస్కారా కూడా కనురెప్పలకు కొద్దిగా అప్లై చేసుకోవచ్చు. దీంతో ముఖం ఆకర్షణీయంగా కనిపిస్తుంది.