Friday, November 22, 2024
HomeతెలంగాణSathupalli: ఆత్మీయ సమ్మేళనంలో MLA సండ్ర

Sathupalli: ఆత్మీయ సమ్మేళనంలో MLA సండ్ర

ఎమ్మెల్యే సండ్రకి పూలాభిషేకం

తమ సేవలను గుర్తించి రెగ్యులరైజ్‌ చేసినందుకు ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని, ఏన్నో ఏండ్ల కలను నెరవేర్చి తమ కుటుంబాలకు భరోసా కల్పించారని వీఆర్‌ఏలు ఆనందం వ్యక్తం చేస్తూ కల్లూరులో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఫ్లెక్సీకి ఖమ్మం జిల్లాలోని విఆర్ఏలు క్షీరాభిషేకం చేసారు. విఆర్ఏల సమస్యలను శాసనసభ పక్షాన, పలుమార్లు కలసి ప్రభుత్వానికి తెలిపిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య కి హర్షాతిరేకలతో ఆనందాన్ని వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కి పూలాభిషేకంతో విఆర్ఏలు ఘన స్వాగతం పలకగా, వేడుకలు ఘనంగా నిర్వహించి అనంతరం భోజనాలు చేసారు. నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలుచుకుంటున్న, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన విఆర్‌ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ చారిత్రక నిర్ణయం ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సత్తుపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ ఇది ఎన్నికల కోసమో రాజకీయాల కోసమో చేసింది కాదని వీఆర్ఏల కష్టాన్ని గుర్తించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలపాలంటూ కోరారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే లాగా వీఆర్ఏల కోసం పోరాడానని తెలిపారు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఇది ఎన్నికల స్టంట్ అంటూ విమర్శిస్తున్నారని అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండి వీఆర్ఏలు ఎవరైనా ఆకస్మిక మరణానికి గురైతే వారి కుటుంబంలో ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని కెసిఆర్ ప్రభుత్వం తెలిపింది అని తెలిపారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో వి ఆర్ ఏ ల పై కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమను చూపిస్తుందని వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు వీఆర్ఏలు గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో వీఆర్వోల జిల్లా జేఏసీ చైర్మన్ ఎస్ కే అజీజ్, రాష్ట్ర ఆర్గనైజర్ కార్యదర్శి శ్రీమతి వీరబాబు అధ్యక్షులు మీర్జాని షరీఫ్ అల్లూరు మండల మహిళా అధ్యక్షురాలు మౌనిక తో పాటు జడ్పిటిసి కట్ట అజయ్ బాబు, లక్కినేని రఘు పేనుబల్లి మండల అధ్యక్షులు వెంకట్రావు . ఎంపీపీ లక్కినేని అలేఖ్య, బాబోలు లక్ష్మణరావు, కాటంనేని వెంకటేశ్వర్లు, పెడకంటి రామకృష్ణ, ఆత్మ చైర్మన్ వనమా వాసు, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవ రెడ్డి ఎస్కే కమ్లి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News