Monday, November 25, 2024
HomeతెలంగాణMadhavaram Krishnarao: దళిత బంధు పథకంపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే

Madhavaram Krishnarao: దళిత బంధు పథకంపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే

ఎంపీ రేవంత్ రెడ్డి ఎప్పుడైనా నియోజకవర్గానికి వచ్చారా?

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో కూకట్పల్లి NKNR గార్డెన్లో దళిత బంధు పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు… ఈ కార్యక్రమానికి 900 మందికి పైగా దళితులు హాజరయ్యారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలతో అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజలో నిలబెట్టారని.. నేడు దళితులు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు వెళ్లేందుకు దళిత బంధు ద్వారా వారికి పది లక్షల రూపాయలు అందించి జీవితంలో వారి ఉన్నతకి సహాయ పడుతున్నారని అన్నారు.

- Advertisement -

ఈ పథకం ద్వారా లబ్ధిదారులు వారు ఎంచుకున్న వ్యాపారానికి సంబంధించి ముందుగా అవగాహన పెంచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అందించే రుణం ద్వారా ఆర్థిక ఉన్నతి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.. అలాగే ఈ పథకానికి సంబంధించి ఎవరైనా బయట వ్యక్తులు కానీ కార్యకర్తలైనా సరే లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే కూకట్పల్లి నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని ప్రతిపక్షాలకు ఇవన్నీ కనబడటం లేదా అని అన్నారు ..దశాబ్దాలుగా పరిష్కారం కానీ బాలానగర్ ఫ్లైఓవర్ మరియు అనేక రకాల పార్కులు ,నూతన డ్రైనేజీ వ్యవస్థ 24 గంటలు విద్యుత్ ఇంటింటికి మంచినీరు ఇవన్నీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని భవిష్యత్తులో కూడా వీటికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు.

ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గంకు ఎన్నిసార్లు వచ్చారు ఏం పనులు చేశారో కూడా ఎవరికీ తెలియదని ఎంతసేపు తమ స్వార్థం గురించి ఆలోచించే కాంగ్రెస్ బిజెపి నాయకులు ఇకనైనా కళ్ళు తెరవాలని పితబోధ చేశారు…ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు ..పగడాల శిరీష బాబురావు ..జూపల్లి సత్యనారాయణ …సభి యా గౌసుద్దీన్ .. మాజీ కార్పొరేటర్ తూమ్ శ్రవణ్ కుమార్ పగడాల బాబురావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News