Saturday, November 23, 2024
Homeహెల్త్'God food' Asafoetida: 'ఇంగువ' తినాలా?

‘God food’ Asafoetida: ‘ఇంగువ’ తినాలా?

సులభంగా జీర్ణం కాని ఆహారాన్ని బాగా అరిగించే 'ఫుడ్ ఆఫ్ గాడ్'

ఇంగువతో హ్యాపీ టమ్మీ

- Advertisement -

చాలామంది కడుపులో గ్యాసు సమస్యతో బాధపడుతుంటారు.  వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యకు వంటింటి మందు ఉందంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంగువ ఈ సమస్యను ఎంతో బాగా పరిష్కరిస్తుందని చెప్తున్నారు. సులభంగా జీర్ణం కాని ఆహారపదార్థాలలో ఇంగువ వేస్తే అవి సులభంగా జీర్ణం అవుతాయని అంటున్నారు. పొట్టకు సంబంధించిన ఎన్నో సమస్యలకు ఇంగువ చక్కటి పరిష్కారమని చెప్తున్నారు.

రకరకాల పదార్థాలను రుచిని పెంచేందుకు మనం వంటల్లో ఉపయోగించే ఇంగువ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదంటున్నారు. గ్యాసు సమస్యను ఇది ఎంతో శక్తివంతంగా పరిష్కరిస్తుందంటున్నారు. ఇందులో ఉపశమనాన్ని ఇచ్చే గుణాలు కూడా ఎన్నో ఉన్నాయిట.  టమ్మీని బాధించే ఎన్నో సమస్యల నుంచి ఇంగువ వెంటనే సాంత్వననిస్తుందిట. సులభంగా జీర్ణం కాని ఆహారపదార్థాలను సైతం బాగా అరిగిస్తుందిట. దీనికి ‘ఫుడ్ ఆఫ్ గాడ్’ అని కూడా పేరు. పచ్చి ఇంగువ వాసన ఎంతో ఘాటుగా, చేదుగా ఉంటుంది. కానీ ఆహార పదార్థాలకు మాత్రం ఇది మంచి ఘుమఘుమలను ఇస్తుంది.

ఇంగువలోని కాంపొనెంట్ యాంటీబాక్టీరియల్ మాత్రమే కాదు లాక్సేటివ్, యాంటి స్పాస్మోడిక్ కూడా. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి సమస్యలను పరిష్కరించే యాంటిసెప్టిక్ గుణాలు ఇంగువలో ఉన్నాయి. అలాగే అజీర్తి వంటి సమస్యలను కూడా బాగా తగ్గిస్తుంది.  పప్పులు, బీన్స్ తో చేసే వంటకాల్లో ఇంగువను ఎక్కువగా వాడడానికి కారణం అవి తొందరగా జీర్ణం కాకపోవడమే. ఇంగువను నిత్యం వాడడం వల్ల జీర్ణశక్తి బలోపేతం అవుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. కడుపులో బాగా లేనపుడు ఒక గ్లాసు నీళ్లల్లో కొద్దిగా ఇంగువ వేసి దానితో పాటు చిటికెడు నల్ల ఉప్పు కూడా అందులో వేసి తాగితే కడుపులో అసౌకర్యంగా ఉన్న ఫీలింగ్ తగ్గుతుంది. నల్ల ఉప్పు కూడా కడుపులో తలెత్తే అనారోగ్య సమస్యలను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అల్లం టీలో కొద్దిగా ఇంగువ వేసుకుని తాగితే పొట్టకు మంచి సాంత్వన వస్తుంది. ఒక కప్పు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా అల్లంపొడి, రాళ్ల ఉప్పు, ఇంగువ వేసి కలుపుకుని తాగితే కూడా జీర్ణశక్తి బాధలు తగ్గుతాయి. కొన్ని చుక్కల గోరువెచ్చటి ఆవనూనెలో చిటికెడు ఇంగువ పొడి వేసి ఆ మిశ్రమంతో బొడ్డు దగ్గర మసాజ్ చేస్తే ఎంతో ఉపశమనాన్ని ఫీలవుతారు. ఇంగువతో కడుపులో పోట్లు తగ్గుతాయి.

ఆస్తమా, బ్రోంకోటిస్, పొడిదగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.  బహిష్టు సమయంలో వచ్చే కడుపునొప్పిని, తలనొప్పిని సైతం ఇంగువ తగ్గిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హ్యాపీ టమ్మీకే కాదు శరీరారోగ్యానికి బెస్ట్ ఫ్రెండ్ మన ఇంగువ అన్నమాట.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News