Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Jawahar Reddy: 5,00,000 గృహాలు ఈనెలాఖరుకల్లా లబ్దిదారులకు అందించాలి

Jawahar Reddy: 5,00,000 గృహాలు ఈనెలాఖరుకల్లా లబ్దిదారులకు అందించాలి

జిల్లా కలక్టర్లు యుద్దప్రాతిపదిక ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ ఆదేశాలు

రాష్ట్రంలో ఈ నెలాఖరు నాటికి 5లక్షల గృహాలను పూర్తి చేసి వాటిని ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న గృహ నిర్మాణ పధకాలను మరింత వేగవంతం చేయాలని చెప్పారు. ఈ నెలాఖరుకు 5 లక్షల గృహాలను పూర్తి చేసి వాటిని ప్రారంభించి లబ్దిదారులకు అందించేందుకు వీలుగా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా నిర్మాణం పూర్తి చేసే ఇళ్ళు వాటి కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రహదార్లు, డ్రైనేజి, సోక్ పిట్లు నిర్మాణం వంటి కనీస సౌకరర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. గృహనిర్మాణాలు పూర్తి చేసే కాలనీల్లో ప్రత్యేక ఆర్చ్ లను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి జిల్లాలో ఈ నెలాఖరుకు గృహనిర్మాణ కాలనీలను పూర్తి చేసి ప్రారంభించి లబ్దిదారులకు అందించేందుకు వీలుగా జిల్లా కలక్టర్లు యుద్దప్రాతిపదిక ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశించారు.

- Advertisement -

అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న టిడ్కో గృహాలు, ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ్ గృహ నిర్మాణాల ప్రగతిని సిఎస్. జవహర్ రెడ్డి సమీక్షిస్తూ ఈగృహాలను కూడా నిర్దేశిత గడువు ప్రకారం సకాలంలో పూర్తి చేసి లబ్దిదారులకు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. ఇంకా ఈ సమావేశంలో గృహ నిర్మాణ పధకాలకు సంబంధించి వివిధ అంశాలపై సిఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు.

అంతకు ముందు గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ రాష్ట్రంలో జరుగుతున్న గృహ నిర్మాణాల ప్రగతిని వివరించారు. ఆగస్టు నెలాఖరు నాటికి 5లక్షల గృహాలను పూర్తి చేసి వాటిని లబ్దిదారులకు అందించేందుక వీలుగా ప్రతి జిల్లాకు లక్ష్యం నిర్దేశించామని తెలిపారు. అలాగే ఆయా గృహాల సముదాయం, కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రహదార్లు, డ్రైనేజి, సోక్ పిట్ల నిర్మాణం వంటివి సమకూర్చేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద వివిధ పనులను చేపట్టి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండి లక్ష్మీ షా, జెఎండి యం.శివ ప్రసాద్, టిడ్కోయండి సిహెఎచ్. శ్రీధర్, సిఇ జివి ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News