Saturday, November 23, 2024
HomeతెలంగాణRema Rajeswari: పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది

Rema Rajeswari: పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది

ఆరోగ్యం పట్ల పోలీసులు శ్రద్ద వహించాలి

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి ఆర్మేడ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఏఆర్ ఎస్ఐగా పదోన్నతులు పొందిన 11 మంది సిబ్బందిని రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి అభినందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని సీపీ అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని, ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు. పోలీసులు నిరంతరం శ్రమిస్తూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద లేకుండా ఉంటారు, వయస్సు పై పడిన అనంతరం ఆ వ్యాధి భాధలు తెలుస్తాయని, కావున సమయం దొరికినప్పుడల్లా యోగ వాకింగ్ రన్నింగ్ చేస్తూ ఉండాలని ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణ గురించి పాటుపడాలని ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటామన్నారు. మానసికంగా శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని, మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా సీపీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఆర్ ఏ సి పి సుందర్ రావు, ఆర్ఐ లు దామోదర్, విష్ణు ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News