‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం కర్నూలులోని 5వ వార్డ్ 14వ సచివాలయం పరిధిలో ఉన్న చిత్తర్ వీధుల్లో నిర్వహించారు. పేదల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అన్నారు. స్థానిక 5వ వార్డులో మున్సిపల్, సచివాలయ సిబ్బంది, స్థానిక వార్డ్ నాయకులతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కుమారి విధిలో ఉన్న ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధితోనే పేదల బతుకులు మారుతాయని చెప్పారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి మేలు చేసేలా పథకాలు తీసుకొచ్చి పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ, 5వ వార్డ్ కార్పొరేటర్ జి.యల్.వి సుజాత, పార్టీ ముఖ్యనాయకులు జి.యల్.వి శేషు యాదవ్, హజ్ కమిటీ మెంబెర్ మంజూర్ మౌలాన, కే.వీ సుబ్బా రెడ్డి, 17వ వార్డ్ కార్పొరేటర్ కైపా పద్మాలతా రెడ్డి, అక్బర్ అలీ, మెహబూబ్ బాషా, ఖాదర్, మాక్సూద్ ,అబ్దుల్లా, మొయిద్, జెట్టి యాదవ్ , వెంకీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు…
MLA Hafiz Khan: మేనిఫెస్టోలో కన్నా ఎక్కువ పథకాలు ఇచ్చిన జగన్
ఆర్థికాభివృద్ధితోనే పేదల బతుకులు మారుతాయి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES