Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: 'నవరత్నాలే' విజయానికి పునాదులు ఎమ్మెల్యే

Gangula: ‘నవరత్నాలే’ విజయానికి పునాదులు ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి జగన్ కు ఆశీర్వాదం ఇవ్వాలన్న ఎమ్మెల్యే గంగుల

రాష్ట్ర వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న నవరత్నాలే వైఎస్ఆర్సిపి విజయానికి పునాదులని రాష్ట్రవ్యాప్తంగా కరోనా కష్టకాలంలో సైతం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వమేని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని .హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ దగ్గర నుండీ నాలుగు రోడ్ల సెంటర్ మీదుగా దొమ్మర కాలనీ, హోసన్న మందిరం,చింతకుంట రోడ్డు, న్యూ ఆచారి కాలనీ ,కీర్తన టాలెంట్ స్కూల్ వీధుల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల పాల్గొని ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను బుక్లెట్ ద్వారా వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ త్వరలోనే తగిన పరిష్కారం చూపుతామని భరోసా కల్పిస్తూ ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు తను పుట్టిన రాయలసీమకు తన 14 ఏళ్ల పాలనలో చెప్పుకోదగ్గ ఒక పని చేయలేదని దుయ్య పట్టారు. రానున్న ఎన్నికల్లో టిడిపికి రాయలసీమలో డిపాజిట్ గల్లంతవ్వడం ఖాయం అన్నారు. రాయలసీమపై చంద్రబాబు చిన్న చూపించిన అందుకే గత ఎన్నికల్లో టిడిపికి ముచ్చటగా మూడు సీట్లతో ప్రజలు సరిపెట్టారన్నారు. టిడిపి హయంలో కరువుకు కేరాఫ్ గా రాయలసీమను మార్చగా నేడు వైఎస్ జగన్ ప్రభుత్వం రాయల సీమను సస్యశ్యామలగాచేసిందన్నారు. సియంవైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలనతో సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఆయన కొనియాడారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత దేశంలోనే జగన్ కే దక్కిందన్నారు. ప్రతి ఒక్కరూ అక్కా చెల్లెమ్మలు తాత అవ్వలు అందరూ చల్లని ఆశీస్సులు ముఖ్యమంత్రి జగన్ కు అందజేయాలని ఎమ్మెల్యే గంగుల కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి మాజీ వ్యవసాయమార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి, మహాలక్ష్మి అధినేత ఇంజేటిరంగేశ్వర్ రెడ్డి సింగం వెంకటేశ్వర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ నాయూబ్ రసూల్, డాక్టర్ సురేంద్ర నాథ్ రెడ్డి, కొత్తూరు సునీల్ న్యాయవాదులు అశ్వర్థ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లుబాలబ్బి, గురుమూర్తి, నరసింహులు, ఏఈలు సురేంద్రరెడ్డి, కంబగిరి, రమణారెడ్డి, ఎస్సై వెంకట్ రెడ్డి, వీఆర్వో పరమేశ్వర్ రెడ్డి ,కాంట్రాక్టర్లు జిడి రామిరెడ్డి, నజీర్, అజాద్, దామోదర్ రెడ్డి, గుర్రప్ప, పంచ నాగరాజు, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News