Saturday, November 23, 2024
HomeతెలంగాణKCR Rythu Runa Mafi: రైతు రుణమాఫీలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు

KCR Rythu Runa Mafi: రైతు రుణమాఫీలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు

తొలి విడతలో 37,000-41,000 మధ్యన ఉన్న రైతు రుణాల మాఫీ

రైతు రుణమాఫీలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.అన్నదాతలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రైతు సంక్షేమం కోసం నిరంతరం తపించే సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారు‌.

- Advertisement -

ఇందులో భాగంగా ఈ రోజు పూర్తి రుణమాఫీ కి సంబంధించి రూ.18,241 కోట్లకు ఆర్థిక శాఖ బడ్జెట్​ రిలీజ్​ ఆర్డర్​ (బీఆర్వో) విడుదల చేసింది.

మొదటి విడత లో భాగంగా రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్యన ఉన్న రైతు రుణాలను మాఫీ చేసేందుకు ఆర్థికశాఖ గురువారం రూ.237.85 కోట్లు విడుదల చేసింది. దీంతో ద్వారా 62,758 మంది రైతులకు లబ్ది చేకూరనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News