Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: బసిరెడ్డి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా

Nandikotkuru: బసిరెడ్డి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా

మెగా జాబ్ మేళాకు 18 కంపెనీలు హాజరు

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా తమ కళాశాలలో సోమవారం నిర్వహించనున్నట్టు బసిరెడ్డి కాలేజ్ ప్రకటించింది. అర్హులైన నిరుద్యోగులంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బసిరెడ్డి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సత్యనారాయణ కోరారు.
శుక్రవారం పట్టణంలోని స్థానికబసిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల నందు మెగా జాబ్ మేళా పోస్టర్లను కళాశాల డైరెక్టర్ సరళ దేవి, కరస్పాండెంట్ సత్యనారాయణ, ప్రిన్సిపల్ కే జాన్ ఎలిషా బాబు విడుదల చేశారు. అనంతరం కళాశాల కరస్పాండెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ చదువుకున్న ఎంతోమంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ మేళాలు నిర్వహించడం ఎంతోమంది నిరుద్యోగులకు చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తాయని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే 18 కంపెనీల సహకారంతో తమ కళాశాలలో ఈనెల 7వ తేదీన సోమవారం మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. మెగా జాబ్ మేళా నందు ఉద్యోగ అవకాశాలు పొందేందుకు తమ కళాశాల యందు ప్రస్తుతం ఫైనల్ ఇయర్ అయిపోయిన, పూర్వ విద్యార్థులతో పాటుగా నిరుద్యోగులు పాల్గొని తమకు నచ్చిన కంపెనీలలో అర్హతకు తగిన ఉద్యోగాలను ఎంచుకోవాలని కోరారు. 18 కంపెనీలతో 1646 ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులకు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బసిరెడ్డి కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News