కూకట్ పల్లి నియోజక వర్గంలోని అల్లాపూర్ డివిజన్ రామారావు నగర్ లో కాంగ్రెస్ పార్టీ నుండి బిఅర్ఎస్ లోకి 30 మంది నేతలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వారిని స్వాగతించారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … కూకట్పల్లి నియోజకవర్గం గత 60 ఏళ్లలో ఎన్నడూ లేని అభివృద్ధి కేవలం ఈ తొమ్మిదిన్నర ఏళ్లలో జరిగిందని కైలాపూర్ ఫ్లై ఓవర్ బాలానగర్ ఫ్లైఓవర్ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి ఎన్నో పార్కులు కమ్యూనిటీ హాల్స్ ఇండోర్ స్టేడియంలో ఇలా చెప్పుకుంటూ పోతే మన కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధి చూసి ఆకర్షితులమై సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దిశా నిర్దేశంలో పార్టీలో పని చేసేందుకు బి ఆర్ఎస్లోకి చేరామని అన్నారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాలుగో రోజు ఓల్డ్ బోయిన్పల్లి లోని పాదయాత్ర నిర్వహించారు… ఈ కార్యక్రమంలో భాగంగా అంజయ్య నగర్, పాములు బస్తి , హరిజన బస్తి ,అంజయ్య నగర్, అస్మత్ పేట.. మొదలగు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఈ నేపథ్యంలో అంజయ్య నగర్.. అస్మత్ పేట ఆ ప్రాంతంలో ఒకప్పుడు వర్షాలు వచ్చినప్పుడు నాళాలు పొంగి ఎంతో ఇబ్బంది పడే వారమని నేడు అస్మత్ పేట చెరువు వద్ద కల్వర్టు నిర్మించి చెరువును అభివృద్ధి చేసినందుకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి కృతజ్ఞతలు తెలుపుతూ మహిళలు మంగళహారతులు ఇచ్చి ఆశీర్వదించారు.. అలాగే డ్రైనేజ్ పూడిక తీత వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ప్రజలు తెలియజేయగా వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడున్న అధికారులకు సూచించారు.. డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి మానవ వనరుల కొరత ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని అతి త్వరలోనే ఈ సమస్య తీరుతుందని హామీ ఇచ్చారు.
కొంతమంది మహిళలు డబుల్ బెడ్ రూమ్ మరియు పింఛన్లకు సంబంధించి వినతి పత్రాలు అందించగా వాటిని స్వీకరించి సంబంధిత అధికారులకు అందించి వారికి అందుబాటులో ఉండి సమాచారం అందించాలని తెలిపారు …ఈ పాదయాత్రలో అడుగడుగునా మహిళలు.. అసోసియేషన్ సభ్యులు.. బస్తీ వాసులు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి సాదర స్వాగతం పలుకుతూ మద్దతు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్.. అధికారులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…