Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: పేదల వృద్ధి కోసమే సంక్షేమ పథకాలు

Gangula: పేదల వృద్ధి కోసమే సంక్షేమ పథకాలు

ఆర్థికాభివృద్ధితోనే పేదల బతుకులు మారుతాయి

పేదల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని 6 సచివాలయం పరిధిలోని 5వ వార్డులోని జంతర్ మంతర్ కాలనీ, తొమ్మండ్రువీధి , సామిల్ వీధి,1 సచివాలయం పరిధిలోని పి. చింతకుంట్లలో ‘గడప గడపకు మన ప్రభుత్వ’ కార్యక్రమంలో విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు, ఆళ్లగడ్డ ఎంపీపీ గజ్జల రాఘవేంద్ర రెడ్డి, కౌన్సిలర్ గోట్లూరు సుధాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి ,సింగం వెంకటేశ్వర్ రెడ్డి ,మహాలక్ష్మి అధినేత రంగేశ్వర్ రెడ్డి, డాాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, నాగిరెడ్డి ,శివనాగిరెడ్డి చంద్రారెడ్డి శంకర్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి లతో కలిసిపాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే తెలపాలని అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధితోనే పేదల బతుకులు మారుతాయని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన కన్నా ఎక్కువ పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వమని , పేదింటి కష్టాలు తొలగించే పథకాలు ప్రతి గడపకు అందుతున్న పథకాలని ,కరోనా సమయంలో కూడా ఆగని పథకాలని , దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి మేలు చేసేలా పథకాలు తీసుకొచ్చి పారదర్శకంగా అమలు చేస్తున్నట్లుఆయన వెల్లడించారు. నాలుగు రోడ్ల సెంటర్లో ఉన్న ఆటో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ఆయనకు వైకాపా నాయకులు ప్రజలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకట్ రెడ్డి ,ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్, డీలర్ ప్రసాద్, కొత్తూరు సునీల్, నజీర్,అజాద్,పంచనాగరాజు కౌన్సిలర్లువరప్రసాద్ రెడ్డి, బాలబ్బి , చక్రపాణి, ఏఈలు , సురేంద్ర రెడ్డి, కంబగిరి, రమణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది బాలస్వామి, మెప్మా సుబ్బయ్య, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News