Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభJr NTR : భార్యను ప్రేమగా హత్తుకున్న తారక్.. ఫొటో వైరల్

Jr NTR : భార్యను ప్రేమగా హత్తుకున్న తారక్.. ఫొటో వైరల్

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇటీవలే పాన్ ఇండియా హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ విడుదలై 9 నెలలైనా ఇంకా దాని హవా కొనసాగుతోంది. కాగా.. సినిమాలను, తన వ్యక్తిగత జీవితాన్ని వేర్వేరుగా చూస్తారు ఎన్టీఆర్. సోషల్ మీడియాకు కాస్త దూరంగానే ఉంటారు. అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాలను గోప్యంగానే ఉంచుతారు. అప్పుడప్పుడు విదేశాల్లో ఫ్యామిలీ ట్రిప్పులకు వెళ్తొస్తుంటారు.

- Advertisement -

ఇటీవల ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం భార్య ప్రణతితో కలిసి జపాన్ వెళ్ళాడు. ఇప్పుడు యూఎస్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా తారక్ ప్రణీతకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మియామీ బీచ్ హోటల్ లో భార్య లక్ష్మీ ప్రణతిని హత్తుకుంటున్న ఫోటో షేర్ చేశారు తారక్. ఈ ఫొటోలో ఎన్టీఆర్ బ్లర్ గా కనిపిస్తున్నారు. కానీ.. తారక్ ఇలాంటి లవ్లీ పిక్ ను షేర్ చేయడం ఇదే తొలిసారి. కొరటాల శివ సినిమా అనంతరం.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News