Thursday, April 10, 2025
HomeతెలంగాణRasamai on Gaddar: గర్జించే గొంతు మూగబోయింది

Rasamai on Gaddar: గర్జించే గొంతు మూగబోయింది

గద్దర్ కు ఘన నివాళులు అర్పించిన రసమయి

ప్రజాగాయకులు గద్దర్ అకాల మరణం నమ్మలేక పోతున్నామని, గర్జించే గొంతు మూగబోయిందని
గద్దర్ మరణవార్తతో ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారని తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ శాసన సభ్యులు డా. రసమయి బాలకిషన్ అన్నారు.  ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ…
ప్రజా గాయకుడు, ప్రజా ఉద్యమకారుడు, తన ఆట పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) ఆకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని అన్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని, విద్యార్థి దశ నుండే ప్రజా ఉద్యమం లో అడుగుపెట్టి ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని పొందిన మహోన్నత వ్యక్తి. వారు భౌతికంగా మన మధ్య లేక పోయిన వారి పాట శాశ్వతంగా బ్రతికే ఉంటుంది అని అన్నారు.

- Advertisement -

-అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నివాళులు…

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వ ర్యంలో ప్రజా యుద్దనౌక, విప్లవ రచయిత గద్దర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళిలు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వoతడుపుల సంపత్, మండల అధ్యక్షులు పారునంది జలపతి, ఆత్మ కమిటీ చైర్మన్ పాశం అశోక్ రెడ్డి, అంబేద్కర్ సంఘ సీనియర్ నాయకులు మాతంగి లక్ష్మణ్, సంగుపట్ల మల్లేశం,కోయడ మురళి,గంగిపల్లి సంపత్, దుర్గం అశోక్, బొర్రా రావన్న, నగునురి వంశీ,తూర్పాటి అజయ్, గాజసాగర్, తాళ్లపల్లి నందకిషోర్, అల్వాల సంపత్, అసంపల్లి అశోక్, కొమ్ము సంపత్, సముద్రాల మల్లేష్, ఎలుక పెళ్లి రాజేందర్, గోదారి కనుకయ్య, దప్పు తిరుపతి, మేకల సునీల్, కండే అజయ్, ఎనగందుల సతీష్, నరేష్, మేకల మహేష్ తో పాటు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News