Saturday, November 23, 2024
HomeతెలంగాణPuvvada: ప్రగతి రథ చక్రాలు ఎప్పటికీ ఆగవు

Puvvada: ప్రగతి రథ చక్రాలు ఎప్పటికీ ఆగవు

పట్టుబట్టి, జట్టు కట్టి, అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించుకున్నాం

రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యన్ని మరింత పటిష్ట పరచి, మరింత మెరుగు చేసేందుకే టిఎస్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఅర్ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

- Advertisement -

రూ.150 కోట్లతో మున్నేరు RCC కాంక్రీట్ వాల్ నిర్మాణం, నిన్న అసెంబ్లీలో ఆర్టీసి ని ప్రభుత్వంలో విలీనం అనంతరం మొదటి సారి ఖమ్మం విచ్చేసిన సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి మున్నేరు బ్రిడ్జి వద్ద భారీ సంఖ్యలో మున్నేరు ముంపు బాధితులు, ఆర్టీసి ఉద్యోగులు, BRS శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ..

43 వేల మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి మనం ఎప్పటికి రుణపడి ఉండాలని కోరారు. ఖమ్మం మున్నేరు పై బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు ఇప్పటికే రూ.180 కోట్లు మంజూరు అయ్యాయని, ఇప్పుడు తాజాగా పేదలను మున్నేరు వరద ముంపు నుండి రక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి నివేదించగా తక్షణమే రూ.150 కోట్లు మంజూరు చేసి క్యాబినెట్ లో పెట్టి అమోదించుకున్నమని పేర్కొన్నారు.

అభివృద్ది, సంక్షేమంలో BRS ప్రభుత్వం ఎక్కడ రాజీ పడదని, కేవలం ప్రజల సంక్షేమం మాత్రమే ఆశిస్తున్నదని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News