Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganur: ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Emmiganur: ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నెహ్రూ ఇందిరా గాంధీ వేసిన ఆర్థిక పునాదులపై బిజేపి పాలిస్తుంది

దేశంలో నెహ్రూ, ఇందిరా గాంధీ వేసిన ఆర్థిక పునాదులపై బిజేపి పాలన చేస్తుందని అప్పటి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పరిశ్రమలు ఇతర ఆదాయ వనరుల వల్ల వచ్చే ఆదాయంతో బిజేపి ప్రభుత్వం పరిపాలిస్తుందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక వీవర్స్ కాలని సొసైటీ లో జాతీయ చేనేత దినోత్సవం ను ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి హాజరు అయ్యారు. అలాగే చేనేత వస్త్రాలు తయారు చేయడంలో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించిన చేనేత కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా చెన్నకేశవ రెడ్డి మాట్లాడుతూ బిజేపి దేశంలో హిందూ ముస్లీం క్రిస్టియన్ ల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతుంది. మణిపూర్ లో ముస్లింల ఇళ్లను బుల్డోజర్ తో కుల్చుతున్నారు. దేశంలో ముస్లింల సమూహం ఎక్కువగా ఉందని, వారు సహనం కోల్పోతే శాంతి భద్రతలు అదుపు తప్పుతాయన్నారు.

- Advertisement -

దేశంలో నెహ్రూ ఇందిరాలు హరిత విప్లవం తెచ్చి నాణ్యమైన విత్తనాలను మెక్సికో నుండి 5 ఓడలలో తెప్పించారు. వీటి ఫలితంగా నేడు 6 లక్షల టన్నులు బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టీ రైతులపై భారం వేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అన్నింటిపై పన్నులు వేస్తున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. జగన్ 9 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేశారు. పోలవరం నుండి పోతిరెడ్డిపాడుకు నీరు తెస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది జరిగే పని కాదు. ఎమ్మిగనూరులో తయారు అయ్యే చేనేత వస్త్రాలకు దేశంలో మంచి ఆదరణ ఉంది. స్కిల్ వస్త్రాలపై యువత దృష్టి పెట్టాలి, మీకు అవసరమయ్యే సహాయం చేస్తాం, గ్రౌండ్ స్థలాన్ని సొసైటీకు దక్కేలా చేశాను. గతంలో ఉన్న కమిషనర్ కృష్ణ స్థలంపై కోర్టుకు వెళ్ళాడు దీంతో ఆయనను బదిలీ చేయించి కొత్త కమిషనర్ ను తెప్పించానన్నారు. దీనికి దయాసాగర్, కోనేరు నాగేంద్ర ప్రసాద్, బీవి జయనాగేశ్వర రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ చేనేతల అభివృద్ధి జగన్ తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో కో ఆపరేటివ్ సొసైటీ సీఈఓ నసర రెడ్డి, చైర్మన్ నాగరాజు, కూర్ని కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారద, కార్యదర్శి వెంకటేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, వైసిపి నాయకులు భీమ్ రెడ్డి, అలువాల గిడ్డయ్య, శివ ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News