Friday, November 22, 2024
Homeఫీచర్స్Japanese Women: జపాన్ మహిళలు స్లిమ్ గా, బొమ్మల్లా ఎందుకుంటారు?

Japanese Women: జపాన్ మహిళలు స్లిమ్ గా, బొమ్మల్లా ఎందుకుంటారు?

జపాన్ మహిళల లైఫ్ స్టైల్స్ వారిని ఎవర్ యంగ్ గా చేస్తాయి

జపాన్ స్త్రీలు చూడడానికి ఎంతో నాజూగ్గా…మెరిసే చర్మంతో బొమ్మల్లా ఎంతో అందంగా కనిపిస్తారు. వారిని చూసి వారి వయసెంతో చెప్పడం కష్టమే. వారు అలా కనిపించడానికి వారి వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లే కారణం. ఎందుకంటే అక్కడ 50 ఏళ్ల స్త్రీ కూడా 30 ఏళ్ల పడుచుపిల్లలా కనిపిస్తుంది. ఇందుకు కారణాలు ఎన్నో.

- Advertisement -

జపాన్ మహిళలు గ్రీన్ టీ బాగా తాగుతారు. అక్కడ ఏ ఇంట్లోకి మీరు వెళ్లినా మొదట అతిథులకు వాళ్లు అందించేది గ్రీన్ టీనే. ఆ టీ కూడా ఎంతో నాణ్యమైన తేయాకు నుంచి తయారుచేసింది. టీ పొడిని వేడినీళ్లల్లో వేసి ఉడికించి గ్రీన్ టీ చేస్తారు. ఈ టీ తీయగా ఉండడమే కాదు దీన్ని తాగడం వల్ల విస్తృతమైన ఆరోగ్యప్రయోజనాలు వాళ్లు పొందుతున్నారు. ముఖ్యంగా వీరు తాగే గ్రీన్ టీలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి ఏజింగ్ ను ఆలస్యం చేయడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా ఎంతో సహాయపడుతాయి.

ఇంకోటేమిటంటే జపాన్ మహిళలు ఎక్కువగా పులయబెట్టిన ఆహారపదార్థాలు అంటే కోంబుచ, కెఫిర్, టెంఫా, మిసో, కిమ్చి వంటివి తింటారు. పాలు పులిసే క్రమంలో జరిగే రసాయన మార్పులతో అందులోని సహజసిద్ధమైన ఫుడ్ న్యూట్రియంట్లు అలాగే ఉండి ఎంతో లాభకరమైన ఎంజైములను, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బి విటమిన్స్, ఇతర ప్రొబయోటిక్స్ ను పెంపొందిస్తాయి. అంతేకాదు వారు తీసుకునే ఈ ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. దీనివల్ల జపాన్ మహిళలు తొందరగా బరువు పెరగరు.

వీళ్లు సీఫుడ్ ను ఎక్కువగా ఇష్టపతారు. బరువు, అనారోగ్య సమస్యలను రేకెత్తించే, కొలెస్ట్రాల్ ను పెంచే రెడ్ మీట్ జోలికి పోరు. పైగా సముద్రజలాల సంపద అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల సీఫుడ్ విపరీతంగా దొరుకుతుంది. ట్యునా, సల్మాన్, మెకరెల్ వంటివి అక్కడ బాగా లభ్యమవుతాయి. చేపల్లో ప్రొటీన్లు బాగా ఉండడంతో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇవి శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయి. ఇంకోటేమిటంటే జపాన్ మహిళలు రోజులో నాలుగైదుసార్లు తక్కువ పరిమాణంలో ఆహారాన్ని తీసుకుంటారు. వారు ఆహారం తినే ప్లేట్లు చిన్నవిగా ఉంటాయి. బౌల్స్ కూడా చిన్నవిగా ఉంటాయి. పైగా వారు స్పూన్లతో కాకుండా చాప్ స్టిక్స్ తో తినడం వల్ల తినే పని నెమ్మదిగా జరుగుతుంది. ఇలాంటి అలవాట్ల వల్ల తక్కువ ఆహారం మాత్రమే వారికి వెడుతుంది. నెమ్మదిగా తినడం వల్ల తినే తిండి తక్కువ వెళ్లి బరువు పెరగరు.

జపాన్ స్త్రీలలో కనిపించే మరో మంచి గుణం నిత్యం నడవడం. స్త్రీలలోనే కాదు జపాన్ దేశ ప్రజల్లోనే ఈ ఆరోగ్యకరమైన అలవాటు బాగా కనిపిస్తుంది. వారి ట్రాన్స్ పోర్టు తీరుతెన్నులు కూడా వారిలో నడక అలవాటును పెంచేలాగ ఉంటుంది. సిటీల్లో రైళ్లే ప్రధాన ట్రాన్స్ పోర్టు సౌకర్యం కావడంతో వారు రైలుస్టేషన్ల వరకూ తప్పకుండా నడవాల్సి ఉంటుంది. కార్లు వాడడానికి సైతం వారు ఇష్టపడరు. నడకతో పాటు జపాన్ మహిళలు సైక్లింగ్ ను కూడా బాగా ఇష్టపడతారు. నిత్యం వాకింగ్, సైక్లింగ్ చేస్తారు. దీనివల్ల వారి కార్డియోవాస్క్యులర్ హెల్త్ తో పాటు శరీరం ఎనర్జీ కూడా పెరుగుతుంది. స్లిమ్ గా కనిపిస్తారు. ఆహారం తీసుకునే వేళల విషయంలో కూడా ఎంతో క్రమశిక్షణను జపాన్ మహిళలు పాటిస్తారు. బర్గర్, స్ట్రీట్ ఫుడ్స్ తినేవాళ్లు మీకు జపాన్ వీధుల్లో కనిపించడం చాలా అరుదు. నడుస్తూ తినడం, టివి చూస్తూ తినడం అక్కడ చేయరు. పైగా నడుస్తూ తినే అలవాటును చాలా అగౌరవమైన పద్ధతిగా జపాన్ లో చూస్తారు. ఈ అలవాట్లు కూడా జపాన్ మహిళలను ఎంతో స్లిమ్ గా కనిపించేలా చేస్తున్నాయి.

వారు వండుకునే విధానం కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. అక్కడ ఆహారపదార్థాలను చాలావరకూ ఉడికించి,ఆవిరితో చేసుకుంటారు. గ్రిల్డ్ టెక్నిక్స్ వంటవి ఎక్కువగా వాడతారు. అంతేకాదు ఆహార పదార్థాలను మెల్లగా ఉడికిస్తారు. డీప్ ఫ్రైలు చేయరు. అతిగా నూనె వాడకం ఉండదు. వారిలో చూసే మరో మంచి అలవాటు ఏమిటంటే సమతులాహారం మాత్రమే తీసుకుంటారు. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఫైబర్ అన్నింటి మిశ్రమంతో వారి డైట్ ఉంటుంది. ఈరకమైన ఫుడ్ ఎంతో సలుభంగా కూడా జీర్ణమవుతుంది.

భోజనం తర్వాత తీపితో నిండి ఉండే డెజర్టులు, ఐస్ క్రీములకు బదులు తాజా పండ్లు తింటారు. వారు తినే ఆహారం శరీరానికి పోషకాలు అందించేలా ఉండేలా చూసుకుంటారు. జపాన్ లో స్త్రీపురుషులు ఇద్దరు చిన్నతనం నుంచే తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు. మార్షల్ ఆర్ట్స్ శరీరానికి పూర్తిస్థాయిలో వర్కవుట్లు ఇస్తాయి. కండరాలన్నింటికీ వ్యాయామాన్ని ఇచ్చి దృఢంగా చేస్తాయి. ఫలితంగా వారి కార్డియోవాస్క్యులర్ ఆరోగ్యం బాగుటుంది. మార్షల్ ఆర్ట్స్ వల్ల సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడమే కాదు స్త్రీలు ఆరోగ్యకరమైన నాజూకుతనంతో అందంగా మెరిసిపోతుంటారు.

జపాన్ మహిళల్లో చూసే మరో ప్రత్యేక గుణం వారి చర్మం అద్దంలా మెరిసిపోవడం. వారి చర్మంపై చిన్నపాటి ముడతలు కూడా మనకు కనపడవు. ఎంత పెద్దవాళ్లైనా సరే స్త్రీలు నాజూగ్గా, స్లిమ్ గా యంగ్ గా, వారి వయసు కన్నా చాలా చిన్నవాళ్లల్లా కనిపిస్తారు. దీనికి కారణం వారు తమ చర్మాన్ని ఎల్లవేళలా ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోవడమే. ఆయిల్ బేస్డ్ క్లీన్సర్లతో మేకప్ ను తొలగించుకుంటారు. చర్మం యొక్క మాయిశ్చరైజర్ గుణాన్ని ఎప్పుడూ సమతుల్యంగా ఉండేలా జాగ్రత్తపడతారు. ఫేషియల్ మసాజ్ లను కూడా అక్కడ స్త్రీలు తప్పకుండా చేసుకుంటారు. ఇవి చర్మంలో రక్తప్రసరణ బాగా జరిగేలా చేయడంతోపాటు కొత్తకణాలు చర్మంలో వృద్ధిచెందుతాయి. దీంతో చర్మం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. అందుకే జపాన్ మహిళలకు మల్లే జీవనశైలి మార్చుకుంటే వారిలా మనం కూడా స్లిమ్ గా…మరింత అందంగా కనిపిస్తామనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News