Sunday, October 6, 2024
HomeతెలంగాణPocharam: పోచారంకు థాంక్స్ చెప్పిన ఆర్టీసీ ఉద్యోగులు

Pocharam: పోచారంకు థాంక్స్ చెప్పిన ఆర్టీసీ ఉద్యోగులు

ఆర్టీసీని చక్కగా నడిపించాలన్న పోచారం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు బాన్సువాడ RTC ఉద్యోగులు, సిబ్బంది.

- Advertisement -

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ… RTC ని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రక నిర్ణయమన్నారు, 43,000 మంది కార్మికులకు ఇదో శుభవార్తని, వారి యాబై సంవత్సరాల కల నెరవేరిందన్నారు. మీరు ఇప్పుడు కార్మికులు కాదు ప్రభుత్వ ఉద్యోగులు, మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలన్నారు పోచారం. క్యాబినెట్ నిర్ణయం తదుపరి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. త్వరలోనే ఇది చట్టంగా మారుతుందన్నారు.

సంస్థ ఉద్యోగులు ప్రయాణికులకు మెరుగైన సేవలను, ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిపేరు తేవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర పరిపాలన దేశానికి ఆదర్శంగా ఉందని, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాను, కానీ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ని మించిన వారు ఎవరూ లేరని ఆయన చెప్పుకొచ్చారు, ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి పదవి కోసం తన్నుకోవడమే సరిపోతుందని విమర్శించారు. తెలంగాణ పథకాలు తమ రాష్ట్రాలలో ఎందుకు లేవని ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారన్నారు పోచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News