IND vs BAN 1st Test : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా విజయానికి చేరువైంది. మరో నాలుగు వికెట్లు తీస్తే గెలుపు భారత్ సొంతం అవుతుంది. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. షకిబ్ అల్ హసన్(40), మెహదీ హాసన్ మిరాజ్(9) క్రీజులో ఉన్నారు. ఐదో రోజు బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే ఇంకా 241 పరుగులు చేయాల్సి ఉండగా టీమ్ఇండియాకు నాలుగు వికెట్లు కావాలి.
అంతకముందు ఓవర్‌నైట్ స్కోర్ 42/ 0 తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన బంగ్లా ఓ దశలో పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ జకీర్ హసన్(100) శతకంతో కదం తొక్కగా మరో ఓపెనర్ నజ్ముల్ హోస్సేన్ షాంటె(67) అర్థశతకంతో రాణించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 124 పరుగులు జోడించారు. అయితే.. భారత బౌలర్లు స్వల్ప వ్యవధిలో నజ్ముల్‌తో పాటు యాసిర్ అలీ(5) వికెట్లు పడగొట్టారు. ఈ దశలో లిటన్ దాస్(19), ముష్పికర్ (23) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే.. భారత బౌలర్లు వారికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. నరుల్ హసన్(3) ఘోరంగా విఫలం అయ్యాడు. భారత బౌలర్లో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్, అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్ కాగా.. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగుల ఆధిక్యం లభించింది. శుభ్‌మన్ గిల్, పూజారాలు శతకాలు బాదడంతో రెండో ఇన్నింగ్స్‌ను భారత్ 258/2 వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్ ముందు 512 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.