ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి చేయలేనప్పుడు మున్సిపల్ చైర్మన్ అధికారులు మున్సిపాలిటీని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అటాచ్ చేయాలని ఆళ్లగడ్డ నియోజకవర్గం బీజేపీ ఇంఛార్జి భూమా కిషోర్ రెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేయటం రెజల్యూషన్షన్స్ కూడా పాస్ చేయడం లేదన్నారు. ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్మన్ ఇద్దరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలతో మున్సిపాలిటీ కుంటుపడుతూ అభివృద్ధి ఆమడ దూరం వెళ్లిందన్నారు. చిన్న కందుకూరు గ్రామ రోడ్డు గుంతలమయంతో ఉందన్నారు. పట్టించుకుండే నాథుడే లేడన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గత నెల రోజులుగా తాము పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు ఏ గ్రామానికి వెళ్లినా ఎటువంటి అభివృద్ధి లేదన్నారు. వీధిలైట్లు లేవు రోడ్లు అన్ని అపరిశుభ్రంగా తయారయ్యాయని పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేరని భూమా విమర్శించారు. తమ పర్యటనలో ప్రజలు ఎక్కడికి వెళ్లినా సమస్యల గురించి అడుగుతున్నారని భూమా పేర్కొన్నారు. అలాగే డివన పెంట సమీపంలోని తెలుగుగంగ కాలువను పరిశీలించామని కాలువ మరమ్మతులు చేస్తున్నారని వర్షాకాలంలో త్వరగా పనులు పూర్తయితే కాలువకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుందని అందుకు అధికార యంత్రాంగం త్వరతగతిన పనులు పూర్తి చేయాలి అలాగే రైతులు టిజిపి కాలువ మీద ఆధారపడి ఉన్నారన్నారు. ఆళ్లగడ్డ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసిన 56 కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని అభివృద్ధి వైపు దృష్టి సారించాలని బిజెపి ఇన్చార్జి భూమా కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు.
Bhuma Kishore: ఆళ్లగడ్డ మున్సిపాలిటీని జిల్లా కలెక్టర్ కు అటాచ్ చేయండి
ఎమ్మెల్యే Vs మున్సిపల్ చైర్మన్- మున్సిపాలిటీని కుంటుపడేలా చేస్తోంది
సంబంధిత వార్తలు | RELATED ARTICLES