Sunday, October 6, 2024
HomeతెలంగాణTandur communal harmony: ధ్వజస్తంభం ప్రతిష్టాపనకు ముస్లిం విరాళం

Tandur communal harmony: ధ్వజస్తంభం ప్రతిష్టాపనకు ముస్లిం విరాళం

మతసామరస్యాన్ని చాటుకున్న బిఆర్ఎస్ పార్టీ యవనాయకుడు జావీద్ హుస్సేన్

మతసామరస్యాన్ని చాటుకున్నాడు బిఆర్ఎస్ పార్టీ యవనాయకుడు, 8వ వార్డు ఇంచార్జి జావీద్ హుస్సేన్. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని రాజీవ్, ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి ధ్వజస్తంభం ప్రతిష్టాపనకు రూ. లక్ష 50వేలు విరాళం అందజేశారు.  ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులందరు జావీద్ ని సన్మానించి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ సందర్భంగా జావీద్ మాట్లాడుతూ రాజీవ్, ఇందిరమ్మ కాలనీ ప్రజలు స్వామి వారి దీవేనాలతో సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. మతవిబేధాలు లేకుండా కలిసిమెలిసి ప్రతిఒక్కరు ఈ నేల 10,11,12 న ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం, నవగ్రహాలు, ధ్వజస్తంభం, బొడ్రాయి, ఒంటెవాహనం, శిఖరం ప్రతిష్టపనలో ప్రతిఒక్కరు భక్తి శ్రద్ధలతో భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యఅతిథిగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యులతో విచ్చేసి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ వెంకన్న గౌడ్, దేవాలయ కమిటీ చైర్మన్ టి. సాయప్ప, అధ్యక్షులు మునేందర్, ఉపాధ్యక్షులు సి.వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకన్న, కోశాధికారి భద్రేశ్వర్, సహాయక కార్యదర్శి ప్రళద్ జాధవ్, సభ్యులు నర్సింలు, సంజీవ్, వెంకటరెడ్డి, ప్రశాంత్, యువనాయకులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News