Friday, November 22, 2024
HomeతెలంగాణMedak collector: సంపద వనాల ఏర్పాటు

Medak collector: సంపద వనాల ఏర్పాటు

జిల్లాలో 70 ప్రాంతాల్లో పంచాయతీలకు సంపద సమకూర్చేలా వనాలను

జిల్లావ్యాప్తంగా 70 ప్రాంతాల్లో సంపద వనాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్శి షా తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని వెంకటాపూర్, చిన్నఘనపూర్ గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో సంపద వనాల పనులను డిఆర్డిఓ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. వెంకటాపూర్లో కలెక్టర్ మొక్కను నాటి నీళ్ళు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం లో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సంపద వనాలను ఏర్పాటు చేస్తున్నట్లు, గ్రామ పంచాయతీలకు సంపద సమకూర్చేలా వనాలను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 36 లక్షల మొక్కలు నాటాలన్నది లక్ష్యం కాగా, ఇప్పటివరకు 75 శాతం మొక్కలు నాటినట్టు తెలిపారు. ఆగస్టు 15వ తేదీన ప్రతి గ్రామంలో 750 మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు, ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీంలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం మండల కేంద్రమైన కొల్చారం లో రైతు ఆగ్రోసేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పాఠశాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా, జిల్లా అటవీ శాఖ అధికారి రవి ప్రసాద్, జిల్లా విద్యాధికారి రాధా కిషన్, ఎంపీడీవో గణేష్ రెడ్డి, సర్పంచులు నెల్లికిష్టయ్య, బొబ్బిలి ఇందిరా ప్రియదర్శిని సందీప్, కరెంటు ఉమాదేవి రాజా గౌడ్, ఇన్చార్జి తైసిల్దార్ కిషోర్, ఏపీవో మైపాల్ రెడ్డి, ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News