Friday, September 20, 2024
HomeతెలంగాణMaloth Kavitha: చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టద్దు

Maloth Kavitha: చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టద్దు

మానవతాదృక్పదంతో వారి పరిస్థితిని గుర్తించాలి..

రైల్వేస్టేషన్ లను ఆధారంగా చేసుకుని వాటి పరిసరాలలో, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవించే పేదప్రజలను ఇబ్బంది పెట్టకుండా వారి పరిస్థితిని మానవీయ కోణంలో ఆలోచించాలని ఆర్ పి ఎఫ్ డిజిపిని ఎంపీ కవిత కోరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రైల్వే స్టేషన్ల పరిధిలో జీవిస్తున్న చిరు వ్యాపారులను రైల్వేపోలీస్ లు ఇబ్బంది పెడుతున్నట్లుగా తనదృష్టికి వచ్చిందని, వారి కుటుంబాలను, పరిస్థితులను, ఆర్థిక స్థితిగతులను మానవతాదృక్పదంతో పరిశీలించాలని, వారిని ఇబ్బంది పెట్టడం మానుకోవాలని మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని మహబూబాబాద్, డోర్నకల్, కేసముద్రం, నెక్కొండ తదితర రైల్వేస్టేషన్ లను ఆధారం చేసుకుని వందలాది మంది నిరుపేదలు, ప్రధానంగా మహిళలు, గిరిజనులు చిరువ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని ఎంపి కవిత వివరించారు.
రైల్వే పోలీసులు వారిని ఇబ్బందులపాలు చేస్తున్నారని, దీంతో తమ కుటుంబాలు ఆకలితో అలమటించే పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు తనను కలిసి ఆవేదనతో వివరించారని యంపి కవిత, ఆర్పీఎప్ డిజిపి మనోజ్ యాదవ్ కు తెలిపారు. ఈ అంశాన్ని ప్రత్యేకమైనదిగా పరిశీలించి, మానవీయ కోణంలో ఆలోచించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వాలని వేలాది నిరుపేద కుటుంబాల తరుపున విజ్ఞప్తి చేస్తున్నట్లు మాలోత్ కవిత తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News