Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: సంక్షేమ పథకాలతో పేదరికాన్ని నిర్మూలించచ్చు

Gangula: సంక్షేమ పథకాలతో పేదరికాన్ని నిర్మూలించచ్చు

ఇంటింటికి వెళ్లి పలకరించిన ఎమ్మెల్యే

పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని 6 సచివాలయం పరిధిలోని 4,6,10వ వార్డులోని టీచర్స్ కాలనీ నెహ్రూ వీధి , బాలాజీ వీధి, మల్లికార్జున వీధి, సాయిబాబా వీధి, పద్మ వీధుల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు,, కౌన్సిలర్ గోట్లూరు సుధాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి ,సింగం వెంకటేశ్వర్ రెడ్డి ,మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్ డాాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డిలతో కలిసిపాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు .ఇంకా సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే తెలపాలని అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి అన్నారు.

- Advertisement -

ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ప్రతి పేదవాడికి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్రవేశపెట్టి పేదవాడు ఉండకూడదు అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అన్నారు. ఇప్పటివరకు 98 శాతం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయన్నారు. నాటి ప్రభుత్వం కేవలం మాటల గారడి తప్ప ఎక్కడ అభివృద్ధి చేసిన పాపాన పోలేదన్నారు మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు ప్రజలను పక్కదారి పట్టించి ఘనత ఆయనదే అన్నారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతివాడు పేదరికం నుండి విముక్తి పొందాలని ఉద్దేశంతోనే ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి పథకాలు అమలు చేసిన దాఖలా లేవన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన కన్నా ఎక్కువ పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వమని , పేదింటి కష్టాలు తొలగించే పథకాలు ప్రతి గడపకు అందుతున్న పథకాలని , పేద ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ సంక్షేమ పథకాలు అందించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ అందరి చల్లని దీవెనలతో ఆశీస్సులతో దీవించాలని ఎమ్మెల్యే గంగుల కోరారు . అంతకుముందు అక్కడికి చేరుకున్న ఆయనకు వైకాపా నాయకులు ప్రజలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకట్ రెడ్డి ,నజీర్, పంచ నాగరాజు, భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు బాలబ్బి , చక్రపాణి, కో ఆప్షన్ మెంబర్ రమేష్ గౌడ్, ఏఈలు , సురేంద్ర రెడ్డి, కంబగిరి, రమణారెడ్డి, మున్సిపల్ సిబ్బంది బాలస్వామి, మెప్మా సుబ్బయ్య, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News