Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Bhuma family: టిడిపి బలోపేతానికి కలిసి రావాలి

Bhuma family: టిడిపి బలోపేతానికి కలిసి రావాలి

ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు అందరిని కలుపుకొని పోతామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది గోబిశెట్టి నరసింహారావును అల్పార విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంగళవారం మాజీ మంత్రి స్వగృహంలో బార్గవ్ రామ్ ,భూమాజగత్ విఖ్వాత్ రెడ్డితో కలిసి అల్ప రవీందర్ లో పాల్గొని, ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అనంతరం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని హైకోర్టు సీనియర్ న్యాయవాది గోగిశెట్టి నరసింహారావు గురుమూర్తి, తిరుపాలు, సుమన్ లు ఈరోజు ఇక్కడికి రావడం ఎంతో శుభసూచకమని మాజీ మంత్రి పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగించబోతున్నదని.. ఎందుకోసమో తాము నియోజకవర్గంలోని అందరినీ కలుపుకుని పార్టీ అభివృద్ధికి నాయకులలో ఐక్యతకు కృషి చేస్తూ వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తామని మాజీ మంత్రి అఖిలప్రియ పేర్కొన్నారు. నాయకులు ప్రజలందరూ సహాయ సహకారాలతో ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయంఖాయమని మాజీ మంత్రి భూమాఅఖిలప్రియ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు శివరామిరెడ్డి రమణ, శివ ప్రసాద్ ,నంద్యాల ఎవిఆర్ ప్రసాద్ మాజీ ఎంపీపీ, బోయలకుంట్ల, శ్రీకాంత్ రెడ్డి మాజీ జెడ్పిటిసి యామా గుర్రప్ప పాల్గొన్నారు.

- Advertisement -


వైసీపీ నుండి టిడిపిలోకి 24 కుటుంబాలు చేరిక
శిరివెళ్ల మండలం ఇసుకపల్లి గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన 24 కుటుంబాలు ఆ పార్టీని వీడి, టిడిపిలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భార్గవ్ రామ్ సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికీ టిడిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీసీపీ విధి విధానాలు నచ్చక పార్టీని వీడినట్లు వారు తెలిపారు. మాజీ మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ అక్రమాలు భరించలేక ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, ప్రజలందరూ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారని.. ప్రతి గ్రామం నుండి పాతవారు కొత్తవారు అందరూ టిడిపిలో చేరుతారని ఆళ్లగడ్డలో టిడిపి జెండా ఎగరేస్తామని మాజీ మంత్రి అఖిలప్రియ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News